Gopichand: గోపీచంద్ నమ్మకాన్ని మారుతి నిలబెట్టుకుంటారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకులలో మారుతి ఒకరనే సంగతి తెలిసిందే. ఈరోజుల్లో, బస్ స్టాప్ సినిమాలతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన మారుతి ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోలతో ఎక్కువగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. మారుతి గత సినిమా ప్రతిరోజూ పండగే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మారుతి ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య కాలంలో గోపీచంద్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి.

మారుతి సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్న గోపీచంద్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. గోపీచంద్ తో తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్ సినిమాతో గట్టిగానే హిట్ కొట్టబోతున్నానని మారుతి చెప్పుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. గోపీచంద్ రాశీ ఖన్నా కాంబినేషన్ లో ఆక్సిజన్, జిల్ సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలలో ఆక్సిజన్ డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంటే జిల్ యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది.

గోపీచంద్ రాశీ ఖన్నా కాంబినేషన్ ఫ్లాప్ కాంబినేషన్ అయినా మారుతి రాశీ ఖన్నా కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి. రాశీ ఖాన్నా కూడా ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తానని భావిస్తున్నారు. రాశీ ఖన్నా గత సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రాశీ ఖన్నా ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాతో పాటు థ్యాంక్యూ సినిమాలో నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి గోపీచంద్ నమ్మకాన్ని మారుతి నిలబెట్టుకుంటారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Share.