విశ్వక్ సేన్ కి స్టార్ ప్రొడ్యూసర్ వరుస ఆఫర్లు!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి టాలెంటెడ్ యంగ్ హీరో దొరికితే వరుస పెట్టి సినిమాలు చేయడం అలవాటు. అల్లు అర్జున్, సిద్ధార్థ్, వరుణ్ సందేశ్, సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్ ఇలా చాలా మంది హీరోలతో తన బ్యానర్ లో సినిమాలు చేశాడు. ఇప్పుడు ఆయన దృష్టి మరో కుర్ర హీరోపై పడింది. అతడే విశ్వక్ సేన్. ఈ కుర్ర హీరో నటించిన మొదటి సినిమా ‘వెళ్లిపోమాకే’ దిల్ రాజు తన సంస్థలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ సినిమా అనుకున్నంతగా ఆడనప్పటికీ.. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్ నుమా దాస్’ లాంటి సినిమాలతో విశ్వక్ సేన్ కి మంచి గుర్తింపు లభించింది. అలానే అతడు నటించిన ‘హిట్’ సినిమాను నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసి మంచి ఫలితాన్ని అందుకున్నారు. ఈ కుర్ర హీరోపై పెట్టుబడి పెడితే మంచి ఫలితాలు వస్తున్నాయని అర్ధం చేసుకున్న దిల్ రాజు.. విశ్వక్ సేన్ ని హీరోగా పెట్టి బెక్కం వేణుగోపాల్ తో కలిసి ‘పాగల్’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పుడు అతడిని హీరోగా పెట్టి మరో సినిమాను మొదలుపెట్టాడు.

తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘ఓ మై కడవులే’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో హీరోగా విశ్వక్ సేన్ ని ఎన్నుకున్నారు. పీవీపీతో కలిసి దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ లాంటి నిర్మాణ సంస్థలు ఇలా యంగ్ హీరోల టాలెంట్ ను గుర్తించి వాళ్లు చిన్న స్థాయిలో ఉన్నప్పుడే కాంట్రాక్ట్ కుదుర్చుకొని సినిమాలు చేస్తుంటాయి. దిల్ రాజు కూడా ఇలానే యంగ్ హీరోలపై పెట్టుబడులు పెడుతున్నాడు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.