సరదాగా పోస్ట్ చేస్తే.. కొంప మునిగింది కదా

ఒక్కోసారి పిల్లలు చేసే అల్లరి పనులు పెద్దలకు తలపోట్లుగా మారుతుంటాయి. ప్రస్తుతం దిల్ రాజు తన కుమార్తె హన్షిత రెడ్డి పోస్ట్ చేసిన ఒక ఇంస్టాగ్రామ్ వీడియో ద్వారా అలంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. విషయం ఏమిటంటే.. దిల్ రాజు కుమార్తె హన్షిత మరియు ఆయన అల్లుడు అర్చిత్ రెడ్డి లాంగ్ ట్రిప్ కు వెళ్లగా.. అక్కడ అర్చిత్ కారు నడుపుతూ బీరు తాగుతున్న వీడియోను హన్షిత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తాగి డ్రైవ్ చేయడమే తప్పు అనుకొంటే.. ఇలా తాగుతూ డ్రైవ్ చేయడం మహా నేరం అని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలెట్టి.. విషయాన్ని ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అయిపొయింది.

dil-rajus-daughter-hanshitha-post-invites-trouble1

నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజుకి ఈ విషయం పెద్ద సమస్య కాకపోయినా.. ఇలా అనవసరంగా మీడియాలో ఆయన పేరు ఇలాంటి విషయాలకు హైలైట్ అవ్వడం అనేది మాత్రం మంచిది కాదు. ఇకనైనా హన్షిత, అర్చిత్ కాస్త జాగ్రత్తగా ఉంటె బెటర్.

dil-rajus-daughter-hanshitha-post-invites-trouble2

Share.