దిల్ రాజు.. పూరీని రిజెక్ట్ చేశాడా?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా కాలం నుండీ హిట్టు కోసం ఎదురుచుతున్నాడు. ‘టెంపర్’ చిత్రం తర్వాత హిట్టందుకోలేదని పూరి కూడా నిజం ఒప్పుకున్నాడు. అయితే ఈసారి ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో హిట్టు కొడతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని ఛార్మీ తో కలిసి నిర్మించాడు పూరి. ‘శంకర్ బ్రెయిన్లో పోలీస్ లు చిప్ పెడతారు.. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి’ అనేదే కథంటూ పూరి చెప్పకనే చెప్పాడు. టీజర్, ట్రైలర్, పాటలకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది… అందులో ఎలాంటి సందేహం లేదు.

dil-raju-shocks-puri-jagannadh1

అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ ను చూసి.. కొనుగోలు చేయమని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ను కోరాడట పూరి. అయితే మొదట సమయం లేదంటూ ఇగ్నోర్ చేసిన దిల్ రాజు … ఆ తరువాత నాకు చాలా సినిమాలు ఉన్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ ను డిస్ట్రిబ్యూట్ చేయలేనని’ మొహమాటం లేకుండా చెప్పేసేసాడట. గతేడాది పూరి తన కొడుకుతో రూపొందించిన ‘మెహబూబా’ చిత్రాన్ని దిల్ రాజు కొనుగోలు చేసి.. డిస్ట్రిబ్యూషన్ చేసాడు. అయితే ఆ చిత్రం ప్లాపవ్వడమే కాకుండా.. దిల్ రాజు జడ్జిమెంట్ పై కూడా విమర్శలు పడ్డాయి. దీంతో ‘ఇస్మార్ట్ శంకర్’ విషయంలో ముందుగానే జాగ్రత్త పడ్డాడని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక జూలై 18 న విడుదల కాబోతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం పూరికి ఎటువంటి ఫలితాన్నిస్తుందో చూడాలి..!

Share.