పవన్ స్థాయే వేరని మరోసారి ప్రూవ్ అయిందిగా..!

పార్టీ కార్యకర్తలైనా ఇంత కష్టపడతారో లేదో కానీ.. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చాలా కష్టపడుతున్నాడు. ఆయాన స్థాపించిన జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీని బలోపేతం కోసం తెగ కష్టపడుతున్నాడు పవన్. ఎండనగా.. వాననగా.. జనాల్లోనే తిరుతున్నాడు. వారి సమస్యలను తెలుసుకుని వాటి కోసం పోరాడుతున్నాడు. ఇప్పుడు అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలని.. అందుకు తనవంతు కృషి కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తిరిగి సినిమాలు కూడా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ చిత్రం రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు.

Pawan Kalyan Latest Pic

వేణుశ్రీరామ్ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తుండగా… దిల్ రాజు, బోనీకపూర్ కలిసి నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి వంటి క్రేజీ హీరోయిన్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలావుంటే… తన రాజకీయ పనులకి ఇబ్బంది కలుగకుండా.. మరో పక్క షూటింగులో కూడా పవన్ పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అమరావతి నుండీ హైదరాబాద్ వచ్చి వెళ్ళడానికి ఎక్కువ సమయం పడుతుందని భావించి.. నిర్మాత దిల్ రాజు పవన్ కోసం ఓ ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేశారట. దీనికోసం అదనంగా కోటి రూపాయలు ఖర్చు అవుతుందని తెలుస్తుంది. ఈ చిత్రం కోసం పవన్ 30 రోజుల కాల్షీట్లు ఇచ్చారట. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ కి విడుదల చేయాలని చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏమైనా హీరోల్లో పవన్ కళ్యాణ్ స్థాయే వేరని మరోసారి ప్రూవ్ అయ్యింది.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.