‘పరిటాల’ పాత్రలో ‘డి.ఎస్.రావ్’

దర్శకసంచలనం రాంగోపాల్ వర్మ తర్వాత అంతటి గట్స్ కలిగిన దర్శకుడిగా ‘దేవినేని’ చిత్రంతో తిరుగులేని విధంగా నిరూపించుకున్న ప్రముఖ దర్శకుడు ‘శివనాగు’ తాజాగా మరో సంచలనానికి శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ‘దేవినేని’ అనంతరం ‘పరిటాల’ పేరుతో మరో సంచలన చిత్రం శివనాగు దర్శకత్వంలో రూపొందనుంది. ‘పరిటాల’ చిత్రంలో తెలుగు ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిన ప్రజా నాయకుడు, సామాజిక-రాజకీయ సంచలనం ‘పరిటాల రవి’ అసాధారణ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండి, ఆయన్ను పోలిన పాత్రను ప్రముఖ నటుడు డి.ఎస్.రావ్ పోషించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ విశేషంగా ఆకర్షించనున్న ఈ సంచలన చిత్రాన్ని ‘ఎన్ షో టైమ్’ బ్యానర్ పై రజనీకాంత్-సి.హెచ్.నాగేశ్వరావు సంయుక్తంగా నిర్మించనున్నారు!!

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.