దేవి శ్రీ ప్రసాద్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో మరి?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పాటలు అలా వినగానే నచ్చేస్తుంటాయి. ఓ నలుగురు స్నేహితులు ఒక ప్లేస్ లో ఉంటే.. అందులో ముగ్గురు మొబైల్ రింగ్ టోన్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక స్టార్ హీరోల సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ అంటే మొదట దేవి శ్రీ ప్రసాద్ నే సంప్రదిస్తుంటారు. నాన్ బాహుబలి రికార్డుల సినిమాలనే దేవి శ్రీ మ్యూజిక్ అందించినవే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ట్రాక్ రికార్డు చాలా ఉంది.

devi-sri-prasad-brother-sagar-got-married1

అంత క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ఇదిలా ఉంటే.. 40 ఏళ్ళ వయసుకు దగ్గరపడుతున్న దేవి శ్రీ ప్రసాద్ ఇంకా పెళ్ళి చేసుకోలేదు. అయితే అతని తమ్ముడు సాగర్ ఈ మధ్యనే పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. జూన్ 19 న సాగర్ పెళ్ళి తన బంధువుల అమ్మాయితో జరిగింది. ఈ విషయం ఆలస్యంగా చెప్పాడు దేవి శ్రీ. డాక్టర్ మౌనికతో తన తమ్ముడి వివాహం జరిగినట్టు చెప్పుకొచ్చాడు.

devi-sri-prasad-brother-sagar-got-married2

జూన్ 19న పెళ్ళి జరిగిందని చెప్పిన దేవి అదే రోజున తన తల్లిదండ్రుల ‘మ్యారేజ్ యానివర్సరీ’ అని కూడా పేర్కొన్నాడు. అయితే తమ్ముడి పెళ్ళి అయిపొయింది కానీ దేవి మాత్రం ఎందుకు పెళ్ళి చేసుకోలేదు. ప్రస్తుతం ఈ విషయం పైనే చర్చ జరుగుతుంది. ‘తమ్ముడి పెళ్ళైపోయింది.. నీదెప్పుడు దేవి?’ అంటూ నెటిజెలు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. గతంలో ఛార్మితో అలాగే మమతా మోహన్ దాస్ తో దేవి శ్రీ ప్రేమాయణం నడిపాడని ప్రచారం జరిగింది. తరువాత అవన్నీ రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది. ఇటీవల ‘రంగస్థలం’ నటి పూజితా పొన్నాడతో దేవి ప్రేమలో ఉన్నాడని.. త్వరలో ఆమెని పెళ్ళి చేసుకోబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది. కానీ అది కూడా రూమరే అని తేలిపోయింది. మరి తన పెళ్ళి విషయం పై దేవి ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి..!

Share.