బిగ్ బాస్ 4: అభిజిత్ ని కాపాడిన హారిక.!

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం నామినేషన్స్ హీటెక్కాయనే చెప్పాలి. ఈసారి నామినేషన్స్ ప్రక్రియని టాస్క్ రూపంలో పెట్టాడు బిగ్ బాస్. మొదటి లెవల్ లో గార్డెన్ ఏరియాలో క్యాప్స్ ధరించిన హౌస్ మేట్స్ రెడ్ కలర్ వచ్చినవాళ్లు నామినేట్ అయ్యారు. ఇందులో అరియానా, అవినాష్, అభిజిత్ ,అఖిల్ నలుగురు ఉన్నారు. ఇక్కడే సెకండ్ లెవల్ లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఎవరైతే గ్రీన్ కలర్ క్యాప్స్ ధరించారో వారితో స్వాప్ చేస్కోవచ్చని చెప్పాడు. ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అయ్యింది.

బయట ఉన్న మోనాల్, సోహైల్ ఇద్దరూ కూడా ఎక్కడా తగ్గలేదు. సోహైల్ తనని తాను బాగా డిపెండ్ చేస్కున్నాడు. హౌస్ లో ఉండటానికి నేను అర్హుడని అనిచెప్పాడు. దీంతో మిగిలిన హౌస్ మేట్స్ అందరూ మోనాల్ ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మోనాల్ ఈసారి ఛాన్స్ తీస్కోదలచుకోలేదు. టాప్ – 5లోకి వెళ్లే ఏ ఒక్క ఛాన్స్ ని ఒదులుకోదలుచుకోలేదు.

చాలాసేపు ఆర్గ్యూమెంట్ చేసింది. అవినాష్ తో, అరియానాతో చాలా సేపు వాదించింది. వారి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పింది. ఇక్కడే మోనాల్ తన గేమ్ ని ఎంత వీక్ గా ఆడిందో హౌస్ మేట్స్ ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, మోనాల్ తను గేమ్ ని ఎంత సీరియస్ గా తీస్కున్నానో చెప్పింది. దీంతో ఎవ్వరికీ కూడా స్వాప్ చేసేందుకు అవకాశం రాలేదు.

చాలాసేపు ఆర్గ్యూమెంట్ అయిన తర్వాత కెప్టెన్ అయిన హారికని ఒక స్వాప్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. తప్పని పరిస్థితుల్లో హారిక ఒక స్వాప్ చేయాల్సి వచ్చింది. ఇక్కడే హారిక తన మైండ్ గేమ్ ఆడింది. ఎందుకంటే తనని కెప్టెన్ ని చేసిన మోనాల్ ని సేఫ్ చేయాలా.. లేదా సోహైల్ ని సేఫ్ చేయాలా అని చాలాసేపు తర్జన భర్జన పడింది. ఇక సోహైల్ గ్రాఫ్, మోనాల్ గ్రాఫ్ ని చూసిన తర్వాత బిగ్ బాస్ చెప్పిన రీజన్ ప్రకారం అయితే మోనాల్ ఐయామ్ వెరీ సారీ అంటూ మోనాల్ ని స్వాప్ చేసేందుకు సిద్ధపడింది. దీంతో మోనాల్ స్వాప్ జెన్యూన్ పర్సన్ తో చేయమని చెప్పింది. దీంతో మోనాల్ ని అభిజిత్ తో స్వాప్ చేసింది హారిక.

ఇక్కడే తను ఇచ్చిన రీజన్స్ కి హౌస్ మేట్స్ అందరూ కూడా ఫిదా అయిపోయారు. హారిక ఈవిషయంలో మరోసారి తన జెన్యూనిటీని చూపించింది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.