విజయ్ దేవరకొండ, రష్మీక మండన్నల నెవర్ ఎండింగ్ లవ్ స్టొరీ ఈ డియర్ కామ్రేడ్

గీతగోవిందం రిలీజ్ టైంలో సినిమా టీజర్, సినిమా లీకవ్వడం కంటే కూడా బాగా పాపులర్ అయిన అంశం ఆ చిత్రంలో విజయ్ – రష్మీకల లిప్ లాక్. సినిమాలో లేకపోయినా కేవలం లీకవ్వడంతోనే ఆ లిప్ లాక్ పుణ్యమా అని సినిమాకి బోలెడంత పబ్లిసిటీ వచ్చింది. విజయ్ ఆ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకున్నట్లున్నాడు.. అందుకే తన తాజా చిత్రం “డియర్ కామ్రేడ్” టీజర్ లొనే మాంచి ఘాటైన లిప్ లాక్ ను వదిలాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లోనూ ఏకకాలంలో మే 31న విడుదలవుతుంది.

dear-comrade-movie-teaser

dear-comrade-movie-teaser

ఈ చిత్రం టీజర్ ను ఇవాళ విడుదల చేసారు. విజయ్ “అర్జున్ రెడ్డి” తరహాలో కోపదారి స్టూడెంట్ గా నటిస్తుండగా.. రష్మీక క్రికెటర్ గా కనిపించనుంది. 1 నిమిషం టీజర్ లో.. 30 సెకన్లు యాక్షన్ విత్ యారోగన్స్ చూపిస్తే.. మరో 30 సెకన్లు రొమాన్స్ విత్ ఇన్నోసెన్స్ చూపించారు. దీన్నిబట్టి సినిమాలో యాక్షన్ తోపాటు రొమాన్స్ కూడా సమపాళ్లలో ఉండబోతోందని స్పష్టమవుతోంది. హీరోగా సూపర్ సక్సెస్ ఫుల్ స్టేజ్ లో ఉన్న విజయ్ దేవరకొండ.. “డియర్ కామ్రేడ్”తో నాలుగు భాషల్లోనూ విజయాన్ని అందుకోగలిగాడంటే.. మనోడికి ఇప్పట్లో ఎదురులేనట్లే.

Share.