ఎప్పటికి ఆగునో ఈ లీకుల గోల

సినిమా షూటింగ్‌ అవుతున్నప్పుడు లీక్డ్‌ వీడియోలు రావడం అభిమానులకు ఆనందమేమో కానీ… నిర్మాతలకు మాత్రం అది పిచ్చెక్కించే వ్యవహారమే. లీకైన వీడియో ఎంత సేపు అన్నది పక్కనపెడితే… అసలు లీక్‌ ఎలా అయ్యింది అని తలలు పట్టుకోవడం వారి వంతవుతుంది. ఇలాంటి పరిస్థితి ఇటీవల కాలంలో పెద్ద హీరోల సినిమాలకు కచ్చితంగా ఎదురవుతూనే ఉంది. మన దేశంలో షూటింగ్‌ జరిగినా, విదేశంలో జరిగినా లీకులు మాత్రం కామన్‌. తాజాగా ఈ పరిస్థితి ‘రాధే శ్యామ్‌’కి వచ్చింది. సినిమా కోసం ఓ పాట షూట్‌ చేస్తుంటే ఆ వీడియోలో చిన్న బిట్‌ బయటకు వచ్చింది.

‘వకీల్‌ సాబ్‌’ ఆఖరి షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. ఇలా స్టార్ట్‌ అయ్యిందో లేదో అలా లీక్డ్‌ ఫొటోలు, వీడియోలు బయటికొచ్చేశాయి. దీంతో చిత్రబృందం బాగా ఇబ్బంది పడింది. ఇప్పుడు ‘రాధే శ్యామ్‌’ పాటల చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్‌, పూజా హెగ్డే మీద పాటను తెరకెక్కిస్తున్నారు. ఈలోగా ఎవరో వ్యక్తి దూరం నుంచి షూటింగ్‌ను మొబైల్‌లో రికార్డు చేసేశారు. ఆ తర్వాత దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇదీ పరిస్థితి. ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది ఇక్కడ అప్రస్తుతం. ఇంత స్ట్రిక్ట్‌గా షూటింగ్‌లో మొబైల్స్‌ వద్దు అని చెబుతున్నా ఎవరూ వినకపోవడం ఆశ్చర్యం.

అసలు ఎవరు ఆ వీడియో రికార్డు చేశారో తెలియడం లేదు కానీ, సోషల్‌ మీడియాలో అలాంటి వీడియోలు కింద.. నా దగ్గర ఫుల్‌ వీడియో ఉంది… పోస్ట్‌ చేసేస్తా.. అయితే నా ట్వీట్‌కు ఓ వెయ్యి రీ ట్వీట్లు చేయండి అంటూ కండిషన్స్‌ పెట్టడం గమనార్హం. సినిమా లీక్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిపోవాలని చూస్తున్నారు. సినిమా తీసే కష్టం… వాళ్ల పాపులారిటీ కోసం వాడుకోవడం ఏదైతే ఉందో.. నభూతో నభవిష్యత్‌. ఏమంటారు మీరు?


Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.