కథే సిద్ధం కాలేదు అంటే, అందులో చరణ్..!

మహేష్ ఫ్యాన్స్ కలల ప్రాజెక్ట్ రాజమౌళి మూవీ ప్రకటన వచ్చేసింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి చేయబోయే మూవీ మహేష్ తోనే అని ధృవీకరించారు. ఇక ఈ మూవీ 2022లో సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు. ఐతే ఈ చిత్రంపై అప్పుడే కొందరు ఉహాగానాలు మొదలుపెట్టారు. ఏమాత్రం ఆధారం లేకుండా ఓ పుకారు పుట్టించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ పాత్ర చేయనున్నాడట. కథరీత్యా ఓ కీలక పాత్ర కోసం చరణ్ ని రాజమౌళి అనుకున్నారట.

ఐతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మహేష్ తో మూవీ అనుకున్నానే కానీ కథ ఇంకా సిద్ధం చేయలేదు అని రాజమౌళి స్వయంగా చెప్పారు. ఎప్పుడో నిర్మాత కె ఎల్ నారాయణ దగ్గర మహేష్ మూవీ కొరకు రాజమౌళి అడ్వాన్స్ తీసుకోగా దాని కొరకు ఆయన మూవీ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి పూర్తిగా బయటకు వచ్చాక రాజమౌళి ఈ చిత్ర కథ గురించి అలోచించినున్నారు.

Crazy rumors spread over Rajamouli Mahesh babu Movie1

తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ లైన్స్ నుండి ఓ మంచి కథ ఎంపిక చేస్తారు. అలాంటి నేపథ్యంలో మహేష్ మూవీలో చరణ్ నటిస్తున్నాడు అనడం అతిశయోక్తే అవుతుంది. ఇక రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు. మరో పది రోజులలో హైదరాబాద్ వేదికగా ప్రత్యేక సెట్స్ లో షూటింగ్ మొదలుకానుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Share.