సాయిపల్లవి పాటపై కాపీ ఆరోపణలు!

దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో తాజాగా ‘సారంగ దరియా’ అనే పాటను విడుదల చేశారు. సాయి పల్లవి నటించిన ఈ పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో మిలియన్ హిట్స్ కొడుతూ దూసుకుపోతుంది. ఈ పాటకి లిరిక్స్ సుద్దాల అశోక్ తేజ అందించారు. అయితే ఇప్పుడు ఈ పాటపై కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వరంగల్ జిల్లాకి చెందిన కోమలి అనే జానపద గాయని ‘సారంగ దరియా’ పాట తనకు చెందినదని.. అలాంటిది తన పర్మిషన్ లేకుండా సినిమాలో వాడేశారని ఆరోపణలు చేస్తుంది. ఈ పాటను తన అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానని.. తొలిసారి ‘రేలా రే రేలా’ షోలో పాడానని.. ఆ షోకి సుద్దాల అశోక్ తేజ జడ్జిగా వ్యవహరించారని చెప్పుకొచ్చింది. ఈ పాట ప్రోమో విడుదలైన సమయంలో కోమలి వెళ్లి దర్శకుడు శేఖర్ కమ్ముల, సుద్దాల అశోక్ తేజలను సంప్రదించిందట.

ఈ పాటను తనతో పాడించామని కోరిందట. కనీసం క్రెడిట్స్ అయినా ఇవ్వాలని అడిగిందట. కానీ అప్పటికే పాటకి సంబంధించిన పనులన్నీ పూర్తి కావడంతో కుదరదని చెప్పేశారట. ఈ విషయాలను కోమలి మీడియా ముందు వెల్లడించింది. అయితే సుద్దాల అశోక్ తేజ మాత్రం జానపదం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారందరి సొత్తని… దానిపై ఏ ఒక్కరికో హక్కు ఉండదని.. అందరికీ హక్కు ఉంటుందని చెప్పారు. ఈ పాటలో పల్లవి అలానే ఉంచి చరణం మాత్రం మార్చినట్లు చెప్పారు. మరి ఈ వివాదం ఇంకెక్కడి వరకు వెళ్తుందో చూడాలి!

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.