జక్కన్న,సుకుమార్ లోని కామన్ పాయింట్ అదే..!

ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ అనేది ఒకటి ఉంటుంది. హీరో-హీరోయిన్, దర్శకుడు-హీరో, దర్శకుడు-నిర్మాత, దర్శకుడు-మ్యూజిక్ డైరెక్టర్ ఇలా క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయి. అలాగే కాంబినేషన్స్ ని సెంటిమెంట్స్, వర్క్ కంఫర్ట్ వలన కూడా రిపీట్ చేస్తూ ఉంటారు. కాగా టాలీవుడ్ లోని ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ తమ మ్యూజిక్ డైరెక్టర్స్ ని మార్చింది లేదు. కెరీర్ బిగినింగ్ నుండి వారు ఆ సంగీత దర్శకులతోనే పనిచేస్తున్నారు. వారిలో ఒకరు రాజమౌళి కాగా, మరొకరు సుకుమార్. ఓటమి ఎరుగని దర్శకుడిగా ఉన్న రాజమౌళి తన మొదటి చిత్రం స్టూడెంట్ నంబర్ వన్ నుండి ప్రస్తుత చిత్రం ఆర్ ఆర్ ఆర్ వరకు కీరవాణితోనే పనిచేశారు. ఇప్పటి వరకు ఆయన చేసిన అన్ని సినిమాలకు కీరవాణినే సంగీతం అందించారు.

బాహుబలి లాంటి భారీ పాన్ ఇండియా మూవీకి కూడా సంగీతం అందించే బాధ్యత కీరవాణికే అప్పగించారు రాజమౌళి. పార్ట్ వన్ విడుదల తరువాత కొన్ని విమర్శలు వచ్చినా ఆయన తన సెంటిమెంట్ ని వదులుకోలేదు. కీరవాణి తన అన్నయ్య అని కావచ్చు, మంచి మ్యూజిక్ ఇస్తాడని కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు రాజమౌళి ఆయన్ని వదిలింది లేదు.

Common point in between Rajamouli and Sukumar1

దర్శకుడు సుకుమార్ కూడా తాను ఇప్పటివరకు తెరకెక్కించిన అన్ని సినిమాలకు దేవీశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ అందించిన సాంగ్స్ ఫెయిల్ అయ్యింది లేదు. సుకుమార్ మొదటి చిత్రం ఆర్య తో మొదలైన వీరి అనుభందం కొనసాగుతూనే ఉంది. బన్నీ లేటెస్ట్ మూవీ పుష్ప చిత్రానికి మ్యూజిక్ అందించే బాధ్యతలు ఎప్పటిలాగే సుకుమార్ దేవిశ్రీకి అప్పగించారు. ఇలా టాలీవుడ్ లో రాజమౌళి, సుకుమార్ లు తమ మ్యూజిక్ డైరెక్టర్స్ ని మార్చలేదు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Share.