‘కమిట్ మెంటల్’ సిరీస్.. ఎంటర్టైన్మెంట్ ఫుల్!

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం, ఉద్భవ్ రఘునందన్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన వెబ్ సిరీస్ ‘కమిట్ మెంటల్’. ఇటీవల పునర్నవి సోషల్ మీడియా ద్వారా ఈ సిరీస్ ని అనౌన్స్ చేసింది. ప్రముఖ మీడియా ప్రొడక్షన్ హౌస్ తమడా నిర్మాణ భాగస్వామ్యంలో ‘ఆహా’ కోసం రూపొందుతున్న ఈ సిరీస్ కి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల హీరో శ్రీవిష్ణు ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

నవంబర్ 13 నుండి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ ద్వారా అను, ఫణిల పాత్రలను పరిచయం చేస్తూ.. వారి స్వభావాలు ఎలా ఉంటాయో చూపించారు. వేర్వేరు దేశాల్లో ఉండే వీరిద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటున్న సీన్ తో టీజర్ మొదలైంది. ముఖ్యమైన ప్రెజంటేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న అనుకి ఫోన్ చేసిన ఫణి.. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ లో కొన్ని మెసేజ్ లను చదివి వినిపిస్తుంటాడు.

అనుని ఇష్టపడే వారు రాసిన రకరకాల కవిత్వాలను వినిపిస్తుంటే.. దానికి విసిగిపోయిన అను ఫోన్ పెట్టబోతే.. ఇంకొకటి ఉంది ఆగు అంటూ మరో కవిత్వం వినిపిస్తాడు. దీంతో ఇరిటేట్ అయిన అను.. ‘ఫణీ..” అని గట్టిగా అరుస్తుంది. ఈ సీన్ మొత్తాన్ని ఎంటర్టైనింగ్ గా రూపొందించారు. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి సిరీస్ రిలీజైన తరువాత ఎలాంటి హిట్ ని అందుకుంటుందో చూడాలి!

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Share.