‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా హైప్ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ ‘కమిట్ మెంటల్’. పునర్నవి, ఉద్భవ్‌ రఘునందన్ జంటగా నటించిన ఈ సిరీస్ ని ‘ఆహా’లో విడుదల చేశారు. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం!

కథ : ఫణి (ఉద్భవ్‌ రఘునందన్) అమెరికా నుండి ఇండియాకు తిరిగి వచ్చి తన ప్రియురాలు అను (పునర్నవి) ఇంటికి వెళ్లి ఆమెకి పెళ్లి ప్రపోజల్ చేస్తాడు. కమిట్మెంట్ ఇవ్వాలంటే భయపడే అను ఇష్టం లేకుండానే ఫణి ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. తన ఉద్యోగం, లైఫ్ లో సెటిల్ అవ్వాలనే విషయంలో అను నిబద్ధతో ఉంటుంది. ఈ క్రమంలో వీరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు, ఫణి ఓవర్ పొసెసివ్నెస్ బిహేవియర్ అనుకి నచ్చదు. దీంతో వీరిద్దరి మధ్య అపార్ధాలు మొదలవుతాయి. పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి వస్తారు. ఆ తరువాత ఏం జరుగుతుంది..? వీరిద్దరూ ఒక్కటవుతారా..? అనే విషయాలతో ఈ సిరీస్ ని నడిపించారు.

విశ్లేషణ : బాలీవుడ్ లో వచ్చిన ‘పర్మినెంట్ రూమ్మేట్స్’ అనే హిట్ వెబ్ సిరీస్ కి రీమేక్ గా ‘కమిట్ మెంటల్’ ని తెరకెక్కించారు. ఈ సిరీస్ బ్యాక్ డ్రాప్ ని హైదరాబాద్ నగర్ సంస్కృతికి తగ్గట్లు సెట్ చేసుకోవడంలో దర్శకుడు పవన్ సాధినేని సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువలు, కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ ఇలా ప్రతీదీ కూడా మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ షో స్టీలర్ మాత్రం ఉద్భవ్ రఘునందన్ అనే చెప్పాలి. ఫేమస్ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న చికాగో సుబ్బారావు అలియాస్ ఉద్భవ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

మొదట ప్రేక్షకులకు ఫణి పాత్రను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. మొదటి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత ఈ పాత్రపై ఆసక్తి పెరిగిపోతుంది. ఉద్దవ్ తన యాక్టింగ్ స్కిల్స్ తో మెప్పిస్తాడు. పునర్నవితో అతడి కెమిస్ట్రీ కూడా బాగుంది. హీరోయిన్ గా నటించిన పునర్నవి తన గ్లామర్ తో, నటనతో ఆకట్టుకుంటుంది. ఫణి విషయంలో ప్రస్ట్రేట్ అవుతూ కనిపించే సన్నివేశాల్లో పునర్నవి జీవించేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా తన పెర్ఫార్మన్స్ తో మెప్పిస్తుంది. సిరీస్ మొత్తానికి ఈ జంట ఒక పెళ్లికి వెళ్లడం, అక్కడ కమిట్మెంట్ యొక్క సీరియస్నెస్ ని అర్ధం చేసుకోవడం హైలైట్ గా నిలిచింది.

ఈ సన్నివేశాల్లో పునర్నవి, ఉద్భవ్ మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. దర్శకుడు భావోద్వేగ కోణంలో ఈ సిరీస్ ని రాసుకొని అంతే బలంగా తెరపై ఎమోషన్స్ పండేలా చూసుకున్నాడు.ఈ సిరీస్ కి ఆనంద్ అందించిన సంగీతం ప్లస్ అయింది. కొన్ని సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ వర్క్ క్రిస్పీగా ఉంది. లెంగ్త్ ఎక్కువ పెట్టి బోర్ కొట్టించకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఈ సిరీస్ లో మరికొన్ని ఎపిసోడ్ లను యాడ్ చేసినా.. చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.

సినిమాటోగ్రఫీ వర్క్ మరో హైలైట్. దర్శకుడు పవన్ సాధినేని తన టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. లివింగ్ రిలేషన్షిప్, సెక్స్ వంటి విషయాలను చర్చించినా.. అందులో ఎలాంటి వల్గారిటీ లేకుండా చూసుకున్నాడు. ప్రముఖ మీడియా ప్రొడక్షన్ హౌస్ తమడా నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సిరీస్ సరదాగా, ఎమోషనల్ గా సాగుతూ యూత్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది.

రేటింగ్: 3.5/5

ఓటీటీ ప్లాట్ ఫామ్ : ఆహా

Share.