‘కామెడీ స్టార్స్’కి హయ్యెస్ట్ టీఆర్ఫీ!

బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది ‘జబర్దస్త్’ షో. ఈటీవీలో ప్రసారమవుతోన్న ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారిలో కొందరు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. చాలా మందికి లైఫ్ ఇచ్చిన ఈ కామెడీ షోని బీట్ చేసే షో మరొకటి రాలేదు. ఈ షోలో ఆడవాళ్లను కించపరుస్తూ కామెంట్స్ చేసినా.. వల్గర్ కామెడీ చేసినా జనాల్లో మాత్రమే ఇదే నెంబర్ వన్ షో అనే ఫీలింగ్ ఏర్పడింది.

దీనికి పోటీగా జీటీవీ ‘అదిరింది’ అనే షో ప్లాన్ చేసింది. నాగబాబుని హోస్ట్ గా తీసుకొచ్చింది. ‘జబర్దస్త్’ కమెడియన్స్ కొందరిని కూడా ఈ షోలోకి లాగేశారు. ఎన్ని ప్లాన్లు వేసినా.. ఈ షో మాత్రం ‘జబర్దస్త్’ని బీట్ చేయలేకపోయింది. కానీ తాజాగా ప్రసారమైన ఓ కామెడీ షో ‘జబర్దస్త్’ని బీట్ చేసేసింది. ‘కామెడీ స్టార్స్’ అనే పేరుతో స్టార్ మా ఓ కొత్త కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ‘జబర్దస్త్’కి పోటీగా మొదలుపెట్టిన ఈ షో మొదటి ఎపిసోడ్ గత ఆదివారం ప్రసారం అయింది.

ఇందులో బిగ్ బాస్ షోలో పాల్గొని పాపులర్ అయిన కమెడియన్ అవినాష్ మెయిన్ యాక్టర్ గా షోని రూపొందించారు. ఈ ఎపిసోడ్ కి 9 పాయింట్ల రేటింగ్ వచ్చింది. గతవారం ప్రసారమైన ‘జబర్దస్త్’ షోకి 7 పాయింట్లు రాగా.. ‘కామెడీ స్టార్స్’కి ఏకంగా 9 పాయింట్ల టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. మొదటి ఎపిసోడ్ తో అయితే జబర్దస్త్ ని బీట్ చేయగలిగిన ఈ షో తరువాత కూడా ఇదే ఊపుని కంటిన్యూ చేస్తుందేమో చూడాలి!

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.