పవన్ నన్ను అలా పిలవడానికి చాలా ఇబ్బంది బడ్డాడు : సుధాకర్

గతంలో తన కామెడీ తో టాలీవుడ్ ను ఓ ఊపు ఆపేసాడు సుధాకర్. ‘శుభాకాంక్షలు’ ‘సుస్వాగతం’ సూర్యవంశం’ ‘రాజా’ వంటి చిత్రాల్లో ఈయన కామెడీని ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అటుతరువాత అనారోగ్యం పాలైన సుధాకర్ ఇప్పుడిప్పుడే కోలుకుని నార్మల్ స్టేజికి వస్తున్నారు. ఇండస్ట్రీలో పెద్ద హీరోలందరికీ ఈయన బాగా క్లోజ్. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాల్ని తెలిపాడు.

sudhakar-with-pawan-kalyan

సుధాకర్ మాట్లాడుతూ… “చిరంజీవి .. నేను మంచి స్నేహితులం. తను ‘వరప్రసాద్’గా వున్నప్పుడే నేను చిరంజీవి అనే పిలిచేవాడిని. ఆ తరువాత అదే ఆయన పేరు కావడం విశేషం. ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించాం. ఇక ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ తో కూడా నాకు మంచి స్నేహం ఉంది. పవన్ చెన్నై వచ్చినప్పుడల్లా మా ఇంటికి తప్పకుండా వస్తుంటాడు. ‘సుస్వాగతం’ సినిమాలో పవన్ నన్ను ‘ఒరేయ్’ అని పిలవాల్సి వచ్చింది. అలా నన్ను పిలవడానికి తను చాలా ఇబ్బంది పడ్డాడు. ‘గోకులంలో సీత’ సినిమా షూటింగులోను ఇదే పరిస్థితి ఎదురైంది. ‘ఫరవాలేదు .. నువ్వు పిలిచేది నన్ను కాదు .. నా పాత్రను’ అని నేను రిక్వెస్ట్ చేయవలసి వచ్చింది. ఇప్పటికీ మా మధ్య అదే స్నేహం ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Share.