యాక్సిడెంట్ పాలైన కమెడియన్ పృథ్వీరాజ్ కారు..!

’30 ఇయర్స్ ఇక్కడ’ అంటూ ప్రేక్షకులకు కితకితలు పెట్టే కమెడియన్ పృథ్వీ రాజ్.. ‌ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం సంచలనంగా మారింది. అక్టోబర్ 19న బంజారాహిల్స్‌ క్యాన్సర్‌ హాస్పిటల్ దగ్గర.. వినాయకుడి గుడి వైపు పృథ్వీరాజ్‌ కారు టర్న్ అవుతూ ఉండగా..అటు వైపు నుండీ వేగంగా వచ్చిన మరో కారు ఢీ కొట్టిందట. దీంతో పృథ్వీ కారు పూర్తిగా ధ్వంసమైనట్టు ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. కారుకి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. కానీ పృథ్వీ గాయాలపాలయ్యారా…?లేక క్షేమంగానే ఉన్నారా? అనే విషయాన్ని మాత్రం వారు తెలపలేదు.

దీని పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఏడాది మొత్తం పృథ్వీ ఏదో ఒక వార్తలో నిలుస్తూనే వస్తున్నాడు. ఏడాది ప్రారంభంలో ఇతను కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. ఇతనికి సంబంధించిన ఓ ఆడియో క్లిప్ పెద్ద ఎత్తున రచ్చ చేసింది. ఇక తరువాత ఇతనికి కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి. అయితే టెస్టుల్లో నెగిటివ్ వచ్చినప్పటికీ.. కరోనా లక్షణాలు ఉండడంతో ఇతన్ని హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో 2వారాలు పాటు ఉంచి చికిత్స అందించారు వైద్యులు.ఇప్పుడు ఇతని కారుకి ప్రమాదానికి గురవ్వడం గమనార్హం.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Share.