కోమాలి సినిమా రివ్యూ & రేటింగ్!

గతేడాది తమిళంలో థియేటర్లలో విడుదలైన చిత్రం “కోమాలి”. జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ జీ5 యాప్ లో నేటి నుండి స్ట్రీమ్ అవుతోంది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం. తమిళంలో ఈ చిత్రం ఎబౌ యావరేజ్ హిట్ గా నిలవడం గమనార్హం.

కథ: 1999 డిసెంబర్ 31న యాక్సిడెంట్ కారణంగా కోమాలోకి వెళ్లిన రవి (జయం రవి) సరిగ్గా 16 ఏళ్ల తర్వాత నిద్ర లేస్తాడు. అప్పటికే ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఈ సరికొత్త ప్రపంచంలో అతడు ఎలా నిలదొక్కుకున్నాడు? లోకల్ ఎమ్మెల్యే (కె.ఎస్.రవికుమార్) కారణంగా ఎదుర్కొన్న సమస్యలను ఎలా అధిగమించాడు? అనేది క్లుప్తంగా “కోమాలి” కథాంశం.

నటీనటుల పనితీరు: నటుడిగా జయం రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవి పాత్రలో జీవించేసాడు. ముఖ్యంగా కన్ఫ్యూజ్డ్ కామెడీ ని పర్ఫెక్ట్ గా తెరపై పండించాడు. కాజల్ అందాల ప్రదర్శనకే కాక కాస్త నట ప్రతిభనూ ప్రదర్శించి ఆకట్టుకుంది. కన్నడ భామ సంయుక్త హెగ్డే మంచి రోల్ ప్లే చేసింది. యోగిబాబు ఎప్పట్లానే తన కామెడీ టైమింగ్ తో అలరించాడు. కె.ఎస్.రవికుమార్ నెగిటివ్ రోల్లో ఆకట్టుకున్నాడు. డాక్టర్ పాత్ర పోషించిన నటుడి కామెడీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది.

సాంకేతికవర్గం పనితీరు: ప్రదీప్ రంగనాధ్ రాసుకున్న కథ ఇప్పటికే పలు హాలీవుడ్, కొరియన్ సినిమాల్లో చూసిందే అయినప్పటికీ.. అతడు తెరకెక్కించిన విధానం బాగుంది. కామెడీ సీక్వెన్స్ లు రాసుకున్న, తెరకెక్కిన విధానం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. 90ల కాలంలో ఉన్న పాజిటివ్ లు, ఇప్పుడు ఉన్న నెగిటివ్ లను సరదాగా చూపిస్తూనే.. టెక్నాలజీకి ఎలా బానిసలమవుతున్నాం అనేది చూపించిన విధానం ఆలోజింపజేస్తుంది. హిప్ హాప్ తమిజ సంగీతం, రిచర్డ్ ఛాయాగ్రహణం మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. టెక్నీకల్ అంశాల కంటే కథ-కథనమే ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్స్. కాకపోతే.. హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవారికి మాత్రం ఈ సినిమా చాలా యావరేజ్ అనిపిస్తుంది. హ్యూమన్ యాంగిల్ ను టచ్ చేసిన విధానం కూడా అలరిస్తుంది. అన్నిటికీ మించి రొమాన్స్ & కామెడీని మిక్స్ చేసి.. కామెడీకి గ్లామర్ అద్దిన విధానం ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ: అద్భుతం, అమోఘం అని పొగడలాల్సిన అవసరం లేకుండా చూస్తున్నంతసేపు పుష్కలంగా అలరించే చిత్రం “కోమాలి”. జయం రవి, యోగిబాబుల కామెడీ, కాజల్ గ్లామర్, పిల్లలు తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు కలగలిసి ఈ చిత్రాన్ని మంచి టైంపాస్ ఎంటర్ టైనర్ గా మలిచాయి. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఈ చిత్రాన్ని చూడొచ్చు.

రేటింగ్: 2.5/5

Share.