నరేష్ కి నోటీసులు ఇవ్వనున్న రాజశేఖర్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎంతో ఉత్కంఠంగా జరుగగా శివాజీరాజా ప్యానెల్‌పై వీకే నరేశ్ ప్యానెల్ విజయం సాధించారనే విషయం మనకి తెలిసిందే. ఇక అధ్యక్షుడిగా వీకే నరేశ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిగా జీవిత నియమితులయ్యారు. అయితే తరచూ వివాదాలకు తెరలేపుతున్న మా లో ఇప్పుడు రాజశేఖర్ కి నరేష్ కి మధ్య బేధాలు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

clash-between-naresh-and-rajasekhar-at-maa-association1

ఇక విషయంలోకి వెళితే, మొదట్లో నరేష్ కి, జీవిత రాజశేఖర్ దంపతుల మధ్య మంచి అనుబంధం అనేది ఉండేది కానీ అధ్యక్షుడైన నరేష్ తన సొంత పనులతో బిజీగా ఉంటున్నాడని, ‘మా’ ని పట్టించుకోకుండా ఏకపక్షంగా ఉండటంతో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయట. అయితే ఇదే విషయం పైనా రాజశేఖర్ సభ్యులతో మాట్లాడి నరేష్ ని అధ్యక్ష పదవి నుండి తీసివేయాలని చర్చించారట. ఇంకా అధ్యక్షుడిని డైరెక్ట్ గా తీసివేయడం కుదరదు కనుక చట్ట పరంగా షోకాజ్ నోటీసులు ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం. మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Share.