ఆ క్రికెటర్ తో అనుపమ ప్రేమలో లేదా..?

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ చాలా కాలంగా ఇండియన్ క్రికెటర్ బుమ్రాతో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరి రిలేషన్షిప్ హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఈ వార్తల్లో నిజం లేదని అనుపమ క్లారిటీ ఇచ్చినా.. ప్రచారం మాత్రం ఆగలేదు. తాజాగా ఈ బ్యూటీ బుమ్రా పుట్టిన ఊరు రాజ్ కోట్ కి వెళ్లడంతో.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై అనుపమ తల్లి సునీతా స్పందించింది.

మీడియాతో మాట్లాడిన ఆమె.. తన కూతురు ప్రస్తుతం ఎవరితో ప్రేమలో లేదని క్లారిటీ ఇచ్చింది. తన దృష్టి మొత్తం సినిమాల మీదే ఉందని.. కెరీర్ తరువాతే దేనిగురించైనా ఆలోచిస్తుందని చెప్పుకొచ్చింది. అనుపమ రాజ్ కోట్ ప్రాంతానికి పెళ్లి కోసం వెళ్లలేదని.. తెలుగు సినిమా షూటింగ్ వెళ్లాల్సి వచ్చిందని.. ఈ ట్రిప్ వెనుక మరో ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది. బుమ్రా కూడా బీసీసీఐ నుండి పెర్సనల్ లీవ్ తీసుకొని రాజ్ కోట్ కి వెళ్లడంతో నెటిజన్లంతా.. బుమ్రా-అనుపమ పెళ్లి చేసుకోబోతున్నారని ఫిక్స్ అయిపోయారు.

కానీ ఇందులో నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. మరి ఇప్పటికైనా ఈ ప్రచారం ఆగుతుందేమో చూడాలి. అనుపమ కెరీర్ విషయానికొస్తే.. గతంతో పోలిస్తే టాలీవుడ్ లో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడ లేదు. ప్రస్తుతం ఈ భామ నిఖిల్ హీరోగా నటిస్తోన్న ’18 పేజెస్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే ‘తల్లి పొగాతే’ అనే ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.