నిస్పృహతో సాగే ఓ ఆశావాది ప్రయాణమే కథాంశంగా!

“అసమర్ధుని జీవియాత్ర” అనే పుస్తకం ఎవరైనా చదివి ఉంటే ఇవాళ విడుదలైన “చిత్రలహరి” ట్రైలర్ చూసి బాగా రిలేట్ అయ్యేవారు. విజయ్ అనే ఓ ఆశావాది నిస్పృహతో విజయం కోసం చేసే ప్రయాణమే కథాంశంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆశావాదిగా సాయిధరమ్ తేజ్ పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ట్రైలర్ కంటెంట్, సాయిధరమ్ తేజ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా, రిలేటబుల్ గా ఉన్నాయి. దాదాపు అరడజను ఫ్లాపుల తర్వాత సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా కావడం, “ఉన్నది ఒకటే జిందగీ” ఫ్లాప్ తర్వాత కిషోర్ తిరుమల నుండి వస్తున్న సినిమా కావడంతో తొలుత ఈ సినిమాపై ఎవరికీ అంచనాలు లేవు. కానీ.. ట్రైలర్ విడుదలయ్యాక మాత్రం సినిమాపై అంచనాలు పెరిగాయి.

chitralahari-movie-trailer-review1

chitralahari-movie-trailer-review2

“హలో” ఫేమ్ కళ్యాణి ప్రియదర్శిని, తమిళ కథానాయకి నివేతా పేతురాజ్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయి, క్యారెక్టర్స్ మన రెగ్యులర్ లైఫ్ లో చూసేవాటిలాగే ఉన్నాయి. సో, సాయిధరమ్ తేజ్ మొత్తానికి మంచి హిట్ కొట్టేలా ఉన్నాడు. ఏప్రిల్ 12న విడుదలవుతున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఇండస్ట్రీ మొత్తం కూడా కోరుకొంటుండడం విశేషం.

Share.