ఎట్టకేలకు సాయిధరమ్ తేజ్ ఒక మంచి హిట్ కొట్టేలా ఉన్నాడుగా

“నా పేరు విజయ్.. నా పేరులో ఉన్న విజయం నా జీవితంలోకి ఎప్పుడొస్తుందో?” అనే డైలాగ్ ఫినిష్ చేసేలోపే అక్కడ కరెంట్ పోతుంది. సెల్ఫ్ సెటర్ లా ఉన్నా కూడా ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కెరీర్ కానీ పర్సనల్ లైఫ్ కానీ అలాగే ఉంది. మనోడు విజయాన్ని దగ్గర నుంచి చూసి రెండేళ్లవుతోంది. ఆ కోపం, కసితో తేజు నటించిన తాజా చిత్రం “చిత్రలహరి”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. ఏప్రిల్ 12న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాయిధరమ్ తేజ్ సరసన నివేతా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శిని కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

chitralahari-teaser-review1

chitralahari-teaser-review2

సాయిధరమ్ తేజ్ క్యారెక్టరైజేషన్, దేవిశ్రీప్రసాద్ సంగీతం, కిషోర్ తిరుమల టేకింగ్ ఇలా అన్నీ కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా టీజర్ లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. దాంతో టీజర్ చూసినవాళ్ళందరూ తేజ్ మళ్ళీ హిట్ కొట్టేలా ఉన్నాడు అని అభిప్రాయపడుతున్నారు. సో, తేజ్ బాబు “చిత్రలహరి”తో మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ అన్నమాట.

Share.