ఈ లోపు చిరంజీవి చెల్లిని ఫిక్స్‌ చేస్తారా?

సెట్స్ మీద సినిమా ఉండగానే… మరో సినిమా మొదలుపెట్టడం ఇటీవల కాలంలో చూడటం చాలా అరుదు. అగ్ర హీరోల విషయంలో అయితే అది ఇంకా తక్కువ. ఒకటి తర్వాత ఒకటి అనే స్టయిల్‌లోనే పని చేస్తుంటారు. కానీ 60 ఏళ్లు దాటిన కుర్రాడు చిరంజీవి మాత్రం వరుస సినిమాలు ఓకే చెప్పేస్తూ వస్తున్నాడు. ‘ఆచార్య’ సినిమా సెట్స్‌ మీద ఉండగానే… తర్వాతి మూడు సినిమాలను సెట్‌ చేసేస్తున్నాడు. అందులో భాగంగానే తర్వాతి ‘లూసిఫర్‌’ను రీమేక్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు ఆ సినిమా ముహూర్తం కూడా ఫిక్స్‌ చేయించేశాడు.

తమిళ దర్శకుడు మోహనరాజా దర్శకత్వంలో మలయాళ సూపర్‌ హిట్‌ ‘లూసిఫర్‌’ను రీమేక్‌ చేస్తున్నట్లు చిరంజీవి ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు. జనవరిలో ప్రారంభించొచ్చు అని వార్తలొచ్చినా.. తేదీ మీద స్పష్టత రాలేదు. అయితే జనవరి 21న సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. పెద్ద హీరోల సినిమా స్టయిల్‌ మనకు తెలిసిందే కదా. దేవుని పటాల మీద ముహూర్తపు షాట్‌ కొట్టేసి ఆ రోజుకు మమ అనిపిస్తారు. అలాగే ఈ సినిమాను ఆ రోజు ప్రారంభించి… ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తారట. అన్నీ అనుకున్నట్లు సాగితే ఏప్రిల్‌ ఆఖరికల్లా సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలనేది చిరు ఉద్దేశంగా తెలుస్తోంది.

సినిమా కీలక పాత్ర చిరంజీవిది అయినా… అందులో అతని చెల్లి, తమ్ముడు, స్నేహితుడు(అనుచరుడు), బావమరిది పాత్రలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఆయా పాత్రల విషయంలో చాలా తర్జనభర్జనలు పడుతోంది చిత్రబృందం. ముఖ్యంగా చెల్లి పాత్ర కోసం చాలామంది స్టార్‌ హీరోయిన్లు, నిన్నటి తరం నాయికల్ని చూస్తున్నారు. ముఖ్యంగా నయనతారను ఆ పాత్రలో నటింపజేయాలని చూస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆమె నుంచి ఇంకా ‘ఓకే’ రాలేదని సమాచారం. ముహూర్తం నాటికి ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్నారు.. వెయిట్‌ ఎండ్‌ సీ.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.