పిక్‌టాక్‌: యువ కెప్టెన్లతో మెగాస్టార్‌

సోషల్‌ మీడియాలోకి వచ్చాక చిరంజీవి కుర్రాడు అయిపోయాడు… కుర్ర హీరోలతో సమానంగా పోస్టులు, ట్వీట్లు, పిక్‌లు పెడుతూ ఫుల్‌ జోష్‌ చూపిస్తున్నాడు. అంతేనా వరుస సినిమాలు ఓకే చేసుకుంటూ ‘నాతో అంత ఈజీ కాదు’ అని యువ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఒక సినిమా సెట్‌ మీద ఉండగా… మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టేశాడు. ఇంకో సినిమా లైన్‌లో పెట్టేశాడు. మరో దర్శకుడికి ఓకే చెప్పేశాడు. చిరంజీవి ఫుల్‌ ఫామ్‌లో ఉన్న రోజుల్లో కూడా ఇంత జోరు చూపించింది లేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో చిరంజీవి ఈ రోజు ఓ ఫొటో షేర్‌ చేశాడు. యువ దర్శకుల మధ్య చిరు యువకుడిలా వెలిగిపోతున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పైన ఉన్నది ఆ ఫొటోనే.

‘లూసిఫర్‌’ సినిమా రీమేక్‌ను ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరు సన్నిహితులు, హితులు, మిత్రులు అందరూ విచ్చేశారు. వారితోపాటు ప్రస్తుతం సినిమా చేస్తున్న కొరటాల శివ, తర్వాత రెడీగా ఉన్న మెహర్‌ రమేష్‌, బాబీ కూడా వచ్చారు. ఎలాగూ ‘లూసిఫర్‌’ రీమేక్‌ దర్శకుడు మోహన్‌ రాజా అక్కడే ఉన్నాడు. దీంతో అందరూ కలసి చిరంజీవితో ఫొటో దిగారు. దానినే చిరంజీవి ఈ రోజు పోస్టు చేశాడు. ‘నా నలుగురు కెప్టెన్లు. ఈ నలుగురితో వినోదం మామూలుగా ఉండదు’ అంటూ ఓ వ్యాఖ్య కూడా రాశారు చిరు. ఆయన ఆ ఫొటోలో ఉన్నది నలుగురు కుర్రాళ్లు అని రాశారు కానీ… అభిమానులు మాత్రం ఫొటోలో ఉన్న ఐదుగురూ కుర్రాళ్లే అని అంటున్నారు. మీకూ అలానే అనిపిస్తోంది కదా.

చిరంజీవి ఆ ఫొటో అలా ట్వీట్‌ చేశాడో లేదో అభిమానులు కామెంట్లు, రీట్వీట్ల మీద పడ్డారు. మరి ఆ ఫొటోలో ఉన్న కుర్ర దర్శకులు ఊరుకుంటారా? వాళ్లు కూడా ధన్యవాదాలు చెప్పారు. ‘మీతో పని చేయడం గర్వంగా ఉంది. ఇది ఆశీర్వాదం’ అని మోహన్‌ రాజా అన్నారు. ‘మిమ్మల్ని చిన్నతనం నుంచి ఆరాదిస్తున్నాను. మిమ్మల్ని డైరెక్ట్‌ చేయాలనే నా కల నెరవేరబోతోంది. మీతో పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అంటూ బాబీ ట్వీట్‌ చేశాడు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.