బిగ్ బాస్ 4: బిగ్ బాస్ స్టేజ్ పైన మెగాస్టార్ చిలిపి చేష్టలు..!

బిగ్ బాస్ హౌస్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. అరవైయేళ్లు దాటిన మనసు చాలా యంగ్ గా ఉందని మరోసారి ప్రూవ్ చేశాడు. సోహైల్, మెహబూబ్, అభిజీత్, అఖిల్ లతో మాట్లాడుతూ వాళ్లలో ఉత్సాహాన్ని నింపితే, అమ్మాయిలతో మాట్లాడుతూ కాస్త చిలిపిచేష్టలు చేసి మెగాస్టార్ అనిపించాడు. హారిక అనగానే నాకు బీచ్ లో తిరిగిన రోజులు, ఆడి పాడిన రోజులు గుర్తుకు వస్తాయి అనగానే ఇందువదన కుందరదన అనే సాంగ్ ప్లే అయ్యింది.

ఇందులో ఐ లవ్ యూ ఓ..హారిక పాట రాంగానే చిన్న స్టెప్ మెగాస్టార్ వేసేసరికి హౌస్ మేట్స్ అందరూ చప్పట్లు కొట్టారు. అంతేకాదు, దేత్తడి హారిక ఇచ్చిన ముద్దులని దాచుకుంటూ కాసేపు ఫన్ చేశాడు. నాగార్జునతో కలిసి ఆ ముద్దులు జేబులో నుంచి తీసినట్లే తీసి ఒక హార్ట్ ని పాకెట్ లో సీక్రెట్ గా పెట్టుకుని కన్నుకొట్టాడు. తర్వాత మోనాల్ తో కూడా మాట్లాడుతూ తనదైన స్టైల్లో ఆటపట్టించాడు. నీ నవ్వు చాలాబాగుంటుందని మోనాల్ ని పొగడ్తలతో ముంచెత్తాడు.

ఆ తర్వాత దివిని చూస్తూ సిగ్గుపడిపోతూ మెగాస్టార్ స్టేజ్ పైన హావభావాలు పలికిస్తుంటే, టెలివిజన్స్ లో చూస్తున్న ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దివికి ఎలాగైనా సరే తన సినిమాలో ఛాన్స్ ఇమ్మని డైరెక్టర్ అయిన మెహర్ రమేష్ కి చెప్పానని, అతి త్వరలోనే నీకు కాల్ వస్తుంది దివి రెడీగా ఉండమని చెప్పాడు మెగాస్టార్. ఒకే సెట్ లో కలిసి వర్కే చేద్దామని చెప్పడంతో దివి ఆనందంతో ఉబ్బితబ్బిబైంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.