సైరా నరసింహారెడ్డి ట్రైలర్ తో అంచనాలు పెంచడమే కాదు..

ప్రెజంట్ జనరేషన్ లో చాలా మంది దర్శకులు కానీ నటులు కానీ చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే.. తమ సినిమా కంటెంట్ ను సరైన విధానంలో ప్రమోట్ చేయలేకపోవడం. రిలీజ్ చేసే పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లకు సినిమాలోని కంటెంట్ కు సంబంధం లేకపోవడం.. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు నిరాశ చెందడం అనేది చాలా రెగ్యులర్ గా జరిగే విషయం. చాలా తక్కువ మంది నటులు మాత్రమే తమ సినిమా మీద అంచనాలు పెరిగేలా మాత్రమే కాక పెరిగిన అంచనాల వల్ల సినిమాకి నష్టం వాటిల్లకుండా కూడా జాగ్రత్తపడతారు. అలాంటి నటుల్లో చిరంజీవి ఒకరు.

sye-raa-movie-trailer-review1

ఆయన కుమారుడు నటించిన “రంగస్థలం” ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమాలోని కీలకమైన అంశాలు రివీల్ చేసినప్పుడు జనాలందరూ.. ఇదేంటి చిరు ఇలా లీక్ చేసేశారు అనుకొన్నారు కానీ.. సినిమా చూశాక అర్ధమైంది చిరంజీవి ఎందుకు అలా చేశారు అని. ఇప్పుడు “సైరా నరసింహా రెడ్డి” విషయంలోనూ చిరంజీవి అదే ఫార్ములాను ఫాలో అయ్యారు. సినిమా కథ ఏమిటి, కథనం ఏమిటి, ఆఖరికి క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది అనే విషయం కూడా చాలా క్లారిటీగా చెప్పేశాడు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో సైరా నరసింహారెడ్డి పాత్రధారిని ఊరి తీస్తారని, సినిమా యాంటీ క్లైమాక్స్ తో ముగుస్తుంది అని చెప్పకనే చెప్పాడు చిరు. దాంతో జనాలు ఒక క్లారిటీతో థియేటర్ కి వస్తారు. అందుకే అంటారు చిరంజీవి మామూలోడు కాదని.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.