ఛార్మి ఒత్తిడి తగ్గడానికి ఏమి చేస్తుందంటే

ముద్దుగుమ్మ ఛార్మి 15ఏళ్లకే వెండి తెరకు పరిచయమైంది. తెలుగులో హీరోయిన్ గా దాదాపు పదేళ్లకు పైగా కొనసాగిన ఛార్మి 2015 తరువాత దర్శకుడు పూరి జగన్నాధ్ తో కలిసి నిర్మాతగా మారింది. నిర్మాతగా మొదటి చిత్రం తనే హీరోయిన్ గా జ్యోతిలక్ష్మీ చిత్రం తెరకెక్కించారు. కొంచెం బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. ఇక నటనకు బైబై చెప్పి పూర్తిగా నిర్మాతగా మారిపోయింది. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరితో పాటు నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఛార్మి, ఇప్పటివరకు 5సినిమాలు నిర్మించారు. వీటిలో రామ్ హీరోగా గత ఏడాది విడుదలైన ఇస్మార్ట్ శంకర్ మాత్రమే హిట్ అయ్యింది.

Charmme Kaur About Her Stress Buster1

ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో ఛార్మి పూరి లు మళ్ళీ పునర్వైభవం తెచ్చుకున్నారు. ప్రస్తుతం వీరు మరో రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. పూరి కుమారుడు ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫైటర్. చిత్ర నిర్మాణంలో తలమునకలై ఉన్న ఛార్మికి అట విడుపు ఆమె పెంపుడు కుక్కలేనట. ఆమె పనుల కారణంగా ఎంత ఒత్తిడిలో ఉన్నా.. ఆమె ఒత్తిడిని దూరం చేసేది ఈ పెట్ డాగ్స్ అని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దర్శకుడు పూరి బేసిగ్గా యానిమల్ లవర్. ముఖ్యంగా ఆయన కుక్కల పట్ల చాల ప్రేమగా ఉంటారు. అది సహనిర్మాతగా ఛార్మి కి కూడా అబ్బినట్లుంది.

Charmme Kaur About Her Stress Buster2
Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Share.