ఛార్మీ పై ముద్దుల వర్షం కురిపించిన రాంగోపాల్ వర్మ

తన శిష్యుడు పూరి జగన్నాథ్ … ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో హిట్టు కొట్టాడు కాబట్టి.. ఆ సక్సెస్ ను తాను కూడా ఎంజాయ్ చేస్తూ గాల్లో తేలిపోతున్నాడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ మంచి కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది. వీకెండ్ పూర్తయ్యే సరికి బ్రేక్ ఈవెన్ సాధించి హిట్టు లిస్ట్ లో చేరడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నారు. ఇక ఎంతో కాలం తర్వాత దక్కిన హిట్టు కావడంతో ‘ఇస్మార్ట్ శంకర్’ టీమంతా కలిసి సక్సెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీకి తన గురువు ‘ఆర్‌జీవీ’ ని అతిధిగా ఆహ్వానించాడు పూరి. ఈ పార్టీలో రాంగోపాల్ వర్మ తెగ రెచ్చిపోయాడు.

charmi-vs-rgv-at-ismart-shankar-success-meet1

ఏకంగా షాంపెయిన్ తో తల స్నానం చేసి, పక్కనే ఉన్న నిర్మాత ఛార్మీని కూడా తడిపేసి గట్టిగా కౌగిలించుకొని రచ్చ…రచ్చ చేశాడు వర్మ. పూరీ జగన్నాథ్ ను కూడా ముద్దు పెట్టుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు వర్మ. అయితే ఛార్మీని కౌగిలించుకోవడమే కాకుండా ముద్దులతో కూడా ముంచెత్తాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘రాము సర్ ఏంటిది’ ‘ఛార్మీని అలా నలిపేస్తున్నారేంటి’ అంటూ నెటిజన్లు కామెంట్లతో తెగ రచ్చ చేస్తున్నారు.

Share.