పెళ్ళి గురించి సంచలన కామెంట్లు చేసిన ఛార్మీ..!

కొంతమంది హీరోయిన్లకు అందం, అభినయం ఉన్నా ఎందుకో కాలం కలిసిరాక ఫేమ్ అవ్వలేరు. ఈ లిస్ట్ లో మనం ఛార్మీ ని చెప్పుకోవచ్చు. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేసి కుర్రకారుని హీటెక్కించింది. డ్యాన్స్ కూడా ఈ అమ్మడు ఇరక్కొట్టేసేది. అయితే ఎందుకో ఈ అమ్మడు హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. కానీ ఈ అమ్మడికి అభిమానుల సంఖ్య ఎక్కువే. ప్రస్తుతం పూరి జగ్గన్నాధ్ తో కలిసి నిర్మాణ రంగం పై ఆమె దృష్టి పెట్టింది. పూరి సినిమాలకి సంబంధించిన విషయాలను ఈ అమ్మడే దగ్గరుండి చూసుకుంటుంది. అయితే ఈ అమ్మడు తన పెళ్ళి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఛార్మీ కు.. పెళ్ళి గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె బదులిస్తూ .. ” పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన లేదు .. పిల్లల్ని కనాలనే ఉద్దేశం లేదు. అలాంటి జీవితాన్ని అనుభవించాలనే కోరిక ఎంతమాత్రమూ లేదు. నిజం చెప్పాలంటే పెళ్ళి .. పిల్లలు .. ఉదయాన్నే నిద్రలేచి ఫ్యామిలీకి కావలసిన ఏర్పాట్లు చేయడం నాకు ఎంతమాత్రం సెట్ కావు. ఇండిపెండెంట్ గా ఉండటానికి ఇష్టపడతాను .. కష్టపడి పనిచేయడం వలన వచ్చే సక్సెస్ తో సంతృప్తిని పొందుతాను” అంటూ కామెంట్స్ చేసింది.

Share.