తెలుగులో ఎవరూ ఆ సినిమా చూడలేదని చెప్తోంది!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కోసం స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నాడు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. తప్పదు మరి… తమన్నా వయసు, సొగసు అటువంటిది. మార్పులకు హీరో నితిన్ సైతం యస్ అన్నాడు. అసలు, ఏ స్క్రిప్ట్‌లో చేంజెస్ చేస్తున్నారు? ఏమా కథ? అనే వివరాల్లోకి వెళితే… నితిన్ హీరోగా యాక్ట్ చెయ్యనున్న ‘అంధాధున్’ రీమేక్‌లో ఇంపార్టెంట్ రోల్‌కి తమన్నాను సెలెక్ట్ చేశారు. సిన్మాలో నితిన్‌కి జోడీగా ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నభా నటేష్ యాక్ట్ చెయ్యనుంది.

ఆమె హీరోయిన్. తమన్నా హీరోయిన్ కాదు. బాలీవుడ్ మూవీలో టబు చేసిన రోల్, తెలుగులో తమన్నాకి ఇచ్చారు. టబు వయసు పెద్దది. హిందీలో ఆమె రోల్ వయసుకి తగ్గట్టు ఉంటుంది. టబుతో కంపేర్ చేస్తే తమన్నా ఏజ్ చాలా తక్కువ. పైగా, సెక్సీగా వుంటుంది. అందుకని, స్క్రిప్ట్ లో చేంజెస్ చేస్తున్నారు. క్యారెక్టరైజేషన్, ట్విస్ట్ లు మాత్రం చేంజ్ చెయ్యడం లేదని తమన్నా చెప్తోంది. ‘అంధాధున్’ థ్రిల్లర్ సిన్మా. ఆల్రెడీ రిలీజయ్యి రెండేళ్లు అవుతోంది. అందులో ట్విస్ట్ మెయిన్. అదేంటో బాలీవుడ్ మూవీస్ చూసేవాళ్లకు తెలుసు.

Tamanna shocking remuneration to host a talk show1

తెలుగులో రీమేక్ చెయ్యడం వల్ల ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ఆడియన్స్ కి ఎగ్జయిట్మెంట్ వుండదేమో అని కొందరి డౌట్. తమన్నా మాత్రం తెలుగులో ఎక్కువమంది ప్రేక్షకులు ‘అంధాధున్’ చూడలేదని చెప్తోంది. తాను హిందీ సినిమా చూసినప్పుడు టబు పోషించిన సిమి క్యారెక్టర్ చాలా రోజులు గుర్తుందని, తెలుగులో ఆ క్యారెక్టర్ చేసే ఛాన్స్ రాగానే వెంటనే యాక్సెప్ట్ చేశానని చెప్పింది. ఈ సినిమా కాకుండా ‘సీటీమార్’, ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాల్లో తమన్నా యాక్ట్ చేస్తోంది.

Most Recommended Video
A
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Share.