మహేష్ తో పోటీ ఎందుకని వెనక్కి తగ్గిన అల్లు అర్జున్!

“అల వైకుంఠపురములో” జనవరి 12న విడుదలవుతుంది అని చిత్రబృందం ప్రకటించి ఇంకా కనీసం వారం రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే సినిమా విడుదల తేదీ మారాబోతుందని టాక్ మొదలైంది. అందుకు కారణం లేకపోలేదు. మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” కూడా జనవరి 12న విడుదలవ్వడానికి రెడీ అవుతోంది. రెండు సినిమాలు ఒకే రోజున విడుదలవ్వడం మంచిది కాదు కాబట్టి.. మహేష్ బాబుకి జనవరి 12వ తేదీని వదిలేసి.. అల్లు అర్జున్ ఇంకాస్త ముందు వచ్చేందుకు సన్నాహాలు చేసుకొంటున్నాడని తెలుస్తోంది.

changes-in-allu-arjun-trivikrams-movie-title1

అందుకే.. విడుదలకు ఇంకా మూడు నెలలు ఉండగానే ప్రమోషనల్ సాంగ్ ను ఇవాళ విడుదల చేసేశాడు త్రివిక్రమ్. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మించగా గీతా ఆర్ట్స్ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. మరి ఈ సినిమా విడుదల తేదీ నిజంగానే మారిందా లేదా అనేది త్వరలోనే తెలిసిపోతుంది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.