గోపీచంద్ `చాణ‌క్య‌` టీజ‌ర్ విడుద‌ల‌

గోపీచంద్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం `చాణక్య‌`. బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్ల‌ర్ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఈ ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

chanakya-movie-teaser-talk1

ఈ సినిమా టీజ‌ర్‌ను సోమ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. యాక్ష‌న్ ప్యాక్‌డ్ టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన గోపీచంద్ లుక్‌, పోస్ట‌ర్స్‌తో పాటు ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్‌తో అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.

Share.