‘చక్ర’ 2 డేస్ కలెక్షన్స్..!

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోల్లో విశాల్ కూడా ఒకడు. ఇతని సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ మధ్య కాలంలో ‘డిటెక్టివ్’ ‘అభిమన్యుడు’ ‘పందెం కోడి2’ వంటి చిత్రాలతో హిట్లు కొట్టిన విశాల్ ఆ తరువాత ‘అయోగ్య’ ‘యాక్షన్’ వంటి చిత్రాలతో కాస్త డల్ అయ్యాడు. అయినప్పటికీ విశాల్ నటించిన తాజా చిత్రం ‘చక్ర’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.ఎం.ఎస్.‌ఆనందన్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న(నిన్న) విడుదల అయ్యింది. ‘జెర్సీ’ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రెజీనా కూడా కీలక పాత్ర పోషించింది.

ఇక ఈ చిత్రం 2 డేస్ కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :

నైజాం   0.58 cr
సీడెడ్   0.34 cr
ఉత్తరాంధ్ర   0.23 cr
ఈస్ట్   0.16 cr
వెస్ట్   0.11 cr
గుంటూరు   0.16 cr
కృష్ణా   0.15 cr
నెల్లూరు   0.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   1.84 cr

‘చక్ర’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.9కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 5.4కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 1.84 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 3.56 కోట్ల షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్లు తగ్గాయి. కానీ పర్వాలేదు అనిపించింది.

Click Here To Read Movie Review

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.