కార్తికేయ ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడుగా..!

‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ఈ చిత్రంలో హీరో కార్తికేయ బ‌స్తి బాల‌రాజు అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది. జేక్స్‌ బిజాయ్ సంగీతంలో రూపొందిన మైనేమ్ ఈజ్ రాజు, క‌దిలే కాలాన్ని.. వంటి పాటలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి.

అంతేకాదు ఈ చిత్రంలో అనసూయ కూడా ఐటెం సాంగ్ చేయడం.. దాని ప్రోమోకి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో మార్చి 19న విడుదల కాబోతున్న ‘చావు కబురు చల్లగా’ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. మార్చి 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతుండగా దీనికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. స్వర్గపురి వాహనం డ్రైవర్‌గా పని చేసే హీరో.. భర్తని కోల్పోయి బాధ పడే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఆమె నుండి తన ఫ్యామిలీ నుండి తరచూ మాటలు పడుతుంటాడు.

అయినప్పటికీ తన ప్రేమని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ సన్నివేశాలన్నీ కూడా చాలా కామెడీగా ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ లో డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్.. హీరోని ఉద్దేశిస్తూ ఎదవ అని తిట్టడం.. దానికి అతడు అమ్మాయిలకు ఎదవలే నచ్చుతారు కదా అని చెప్పే డైలాగ్స్ యూత్ కి కనెక్ట్ అవుతాయి. సింపుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో ఈసారి కార్తికేయ హిట్ కొట్టే ఛాన్స్ లు బాగానే కనిపిస్తున్నాయి. ఈ సినిమాను మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ సమర్పణలో రూపొందిస్తున్నారు. ‌బన్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.


ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.