ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!

మన టాలీవుడ్ లో అక్కినేని నాగ చైతన్య మరియు అఖిల్ ఇద్దరూ బ్రదర్స్ అన్న సంగతి అందరికీ తెలుసు.అయితే వీరిద్దరికి తండ్రి నాగార్జునే అయినప్పటికీ.. తల్లులు వేరు. అయినప్పటికీ వీళ్ళు సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఆప్యాయంగా కలిసుంటారు. కేవలం వీళ్ళు మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది ఒక తల్లికి పుట్టకపోయినా.. వారి మధ్య అనుబంధం మాత్రం అందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుంది. మరి అలాంటి సెలబ్రిటీలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) నాగ చైతన్య & అఖిల్ :

ఆల్రెడీ చెప్పుకున్నాం కదా.. ! వీళ్ళిద్దరూ కింగ్ నాగార్జున కొడుకులే. అయితే నాగ చైతన్య తల్లి.. నాగార్జున మొదటి భార్య లక్ష్మీ కాగా… అఖిల్ తల్లి నాగార్జున రెండో భార్య అయిన అమల.

2) సారా అలీఖాన్ & తైమూర్ :

అమ్రితా సింగ్ ను చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకున్న సైఫ్ అలీ ఖాన్… మొదట సారా అలీఖాన్ మరియు ఇబ్రహీం లకు జన్మనిచ్చాడు. అటు తరువాత కరీనా కపూర్ ను రెండో పెళ్లి చేసుకుని … సారా మరియు ఇబ్రహీం లకు ఒక బ్రదర్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు.

3) మంచు మనోజ్ & విష్ణు, లక్ష్మీ :

విష్ణు, లక్ష్మీ లు… మోహన్ బాబు మొదటి భార్య అయిన విద్య దేవి గారికి జన్మించారు.ఇక మనోజ్ అయితే మోహన్ బాబు గారి రెండో భార్య నిర్మల దేవి గారికి జన్మించారు.

4) జ్యోతిక & నగ్మా :

వీళ్ళిద్దరూ అక్కా చెల్లెల్లే.. కానీ ఇద్దరు తల్లిదండ్రులు వేరు. కజిన్స్ అన్న మాట.

5) షాహిద్ కపూర్ & ఇషాన్ కత్తర్ :

ఇద్దరూ ఒక తల్లికి పుట్టినవారే కానీ తండ్రులు వేరు.

6) కళ్యాణ్ రామ్ & ఎన్టీఆర్ :

ఇద్దరూ హరికృష్ణ గారి కొడుకులే. అయితే తల్లులు వేరు. అయినా వీరి మధ్య అనుబంధం పీక్స్ లో ఉంటుంది.

7) మహేష్ బాబు & నరేష్ :

ఇద్దరు తండ్రులు మరియు తల్లులు వేరు. కానీ చాలా ప్రేమగా కలిసి మెలిసి ఉంటారు.

8) అరుణ్ విజయ్ & శ్రీదేవి :

ఇద్దరికీ తండ్రి విజయ్ కుమారే ..కానీ తల్లులు వేరు.

9) అర్జున్ కపూర్ &జాన్వీ కపూర్ :

అర్జున్ కపూర్.. బోణి కపూర్ కు మొదటి భార్య సంతానం. ఇక జాన్వీ కపూర్ రెండో భార్య శ్రీదేవికి జన్మించింది.

10) సన్నీ, బాబీ డియోల్, ఈషా, అహనా డియోల్ :

వీళ్ళకి తండ్రి ఒక్కరే.. తల్లులు వేరు..!

Share.