లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

‘కళ్యాణమొచ్చినా.. కక్కొచ్చినా ఆగదు’ అని మన పెద్దవాళ్ళు పదే పదే చెబుతూ ఉంటారు. ‘పెళ్లి పలనా టైములో చేసుకుందాం’ అని ఎవరు ఎంత అనుకున్నా.. అది వారు అనుకున్న టైంలోనే అవుతుంది అని కచ్చితంగా చెప్పలేము. దాని టైం దానికి ఉంటుంది. ఎంత ప్లాన్ చేసుకున్నా.. అది ఎవరికి ఎప్పుడు అవ్వాలో ఆ టైంలోనే జరుగుతుంది. అయితే మన టాలీవుడ్ సెలబ్రిటీలకు మాత్రం ఈ కరోనా లాక్ డౌన్ టైమే పెళ్లికి కలిసొచ్చిందని చెప్పాలి. ఎప్పుడూ సినిమా షూటింగ్లలో బిజీగా ఉండడం వల్ల.. పెళ్లి అనే వేడుకకి దూరంగా ఉంటూ వచ్చిన మన సినీ సెలబ్రిటీలకు.. పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన పుట్టింది మాత్రం ఈ కరోనా టైంలోనే..! మరి ఈ 2020 లో పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) దిల్ రాజు(రెండో పెళ్లి) :

తేజస్వి అనే అమ్మాయిని ఈ 2020లోనే పెళ్లి చేసుకున్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. 49ఏళ్ళ దిల్ రాజుకి ఇది రెండో పెళ్లి. ఈయన మొదటి భార్య అనిత గారు 2017 లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దాంతో ఈయన ఒంటరిగా ఉంటూ వస్తోన్న నేపథ్యంలో ఈయన కూతురు హన్షిత రెడ్డి రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చెయ్యడంతో.. దిల్ రాజు కాదనలేకపోయారు.

2) నిఖిల్ :

పల్లవి వర్మ అనే అమ్మాయితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉంటూ వచ్చిన నిఖిల్.. ఈ కరోనా లాక్ డౌన్ టైంలోనే ఆమెను పెళ్లాడాడు.

3) నితిన్ :

మన నితిన్ కూడా ఈ కరోనా లాక్ డౌన్ టైంలోనే పెళ్లి చేసుకున్నాడు. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో తాను ప్రేమించిన షాలినీని పెళ్లి చేసుకున్నాడు.

4) రానా :

ప్రభాస్ తరువాత ఇప్పట్లో పెళ్లి చేసుకోడు అని ఏ హీరోనైనా ప్రేక్షకులు అనుకున్నారా అంటే? అది కచ్చితంగా దగ్గుబాటి రానా గురించి అనే చెప్పాలి. తాను కూడా మిహీక బజాజ్ అనే అమ్మాయిని ఈ లాక్ డౌన్ టైములో పెళ్లి చేసుకున్నాడు.

5) ‘రంగస్థలం’ మహేష్ :

మొదట ‘జబర్దస్త్’ ఫేమ్ అనిపించుకున్న మహేష్.. ఆ తరువాత ‘రంగస్థలం’ ఫేమ్ అనిపించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈయన కూడా పావని అనే అమ్మాయిని ఈ లాక్ డౌన్ టైంలోనే పెళ్లి చేసుకున్నాడు.

6) రాజా చెంబోలు :

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అబ్బాయి.. మరియు ప్రముఖ నటుడు అయిన రాజా వివాహం కూడా ఈమధ్యనే జరిగింది. వెంకట లక్ష్మీ హిమబిందు అనే అమ్మాయితో రాజా వివాహం జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి.

7) నీతి టైలర్ :

‘మేం వయసుకు వచ్చాం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నీతి టైలర్ కూడా ఆగష్టులో పరీక్షిత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

8) షాలిని వడ్నికట్టి :

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫేమ్ షాలిని కూడా ఈ లాక్ డౌన్ టైంలోనే సైలెంట్ గా పెళ్లి చేసుకుంది.

9) సనా ఖాన్ :

‘కళ్యాణ్ రామ్ కత్తి’ ‘మిస్టర్ నూకయ్య’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సనా ఖాన్ కూడా ఈ లాక్ డౌన్ టైంలోనే పెళ్లి చేసుకుంది.

10) కాజల్ అగర్వాల్ :

తన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ బిజినెస్మెన్ అయిన గౌతమ్ కిచ్లుని అక్టోబర్ 30న పెళ్లి చేసుకుంది కాజల్.

Share.