రెమ్యునరేషన్ అడిగితే కేసు పెట్టారట..!

కోలీవుడ్ లో హాస్యనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మధుమిత ఇటీవల తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్నాళ్ళు ఆమె బాగానే ఉన్నా… తరువాత కెప్టెన్ అయినతరువాత ఆమెను కొందరు హౌస్మేట్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారంటూ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడంతో ఆమెను హౌస్ నుండీ బయటకి పంపించేశారు. ఈ క్రమంలో తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ వెంటనే ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానంటూ బిగ్ బాస్ నిర్వాహకులని బెదిరిస్తోందని వారు చెన్నైలోని గిండీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

vijay-tv-files-case-against-bigg-boss-3-madhumitha

ఈ విషయం పై మధుమిత టీవీ యాజమాన్యం పై మండిపడింది. మధుమిత మాట్లాదుతూ.. “దాదాపు పదేళ్ళుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పటివరకూ నా పై ఎటువంటి కంప్లైంట్ లేదు. నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ అడిగితే కేసు పెడతారా? విజయ్ టీవీ నిర్వాహకులను నాకు ఇవ్వాల్సిన పారితోషికం అడగగా.. బిల్లు పంపమని చెప్పారు. వారు చెప్పినట్లే బిల్లు పంపించాను. త్వరలోనే డబ్బులు ఇస్తామని చెప్పారు. మా మధ్య ఎటువంటి సమస్య లేదని అనుకున్నాను. కానీ సడెన్ గా విజయ్ టీవీ నిర్వాహకులు నా పై పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో అర్ధం కావడం లేదు. విషయం తెలిసి వారికి ఫోన్ చేస్తే స్పందించలేదు.. ఈ విషయంలో కమల్ హాసన్ జోక్యం చేసుకొని.. పరిష్కారం చూపిస్తే చాలా బెటర్.నేను బయటకి రావడానికి సంబంధించిన ఫుటేజీలను ప్రసారం చేయకపోవడం బాధగా ఉంది. బిగ్ బాస్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఇతర విషయాలు నేను మాట్లాడలేకపోతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

1

bigg-boss-3-madhumitha

2

bigg-boss-3-madhumitha1

3

bigg-boss-3-madhumitha2

4

bigg-boss-3-madhumitha3

5

bigg-boss-3-madhumitha5

6

bigg-boss-3-madhumitha6

7

bigg-boss-3-madhumitha7

8

bigg-boss-3-madhumitha8

Share.