మెగా ప్రిన్స్.. ఆ ప్లాప్ సెంటిమెంట్ ను జయిస్తాడా?

అదేంటి… హ్యాట్రిక్ కొడితే మంచిదే కదా.. ! అయినా వరుణ్ హ్యాట్రిక్ కొడితే ప్రాబ్లెమ్ ఏంటి.. అసలు మన మెగా ప్రిన్స్ ఇందులో హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అనేగా మీ డౌట్..! హ్యాట్రిక్ అంటే నిజ జీవితంలో అయినా, క్రికెట్ లో అయినా మనం ఎక్కువ ఇష్టపడుతుంటాం. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా హ్యాట్రిక్ హిట్లు కొడితే చాలా ఆ చిత్ర యూనిట్ తో పాటు ఆ హీరోను అభిమానించే వాళ్ళు కూడా తెగ సంబరపడిపోతారు. అయితే ఇక్కడ మన వరుణ్ హిట్లలో.. కాదు ప్లాపుల్లో హ్యాట్రిక్ కొడతాడేమో అని కొందరు మెగా అభిమానులు భయపడుతున్నారు.

jarra-jarra-super-mass-number-from-valmiki-movie1

అలా అనుకున్నా వరుణ్ గత చిత్రం ‘ఎఫ్2’ హిట్టయ్యింది కదా.. ప్లాపుల్లో ఎలా హ్యాట్రిక్ కొడతాడు అనేగా మీ డౌట్? అసలు విషయం ఏమిటంటే.. వరుణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘వాల్మీకి’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడు వరుణ్. దానికోసం కొత్త మేకోవర్ కూడా ట్రై చేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి మిక్కీ.జె.మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ కు కూడా మంచి స్పందన లభించింది. అయితే వరుణ్ – మిక్కీ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘ముకుంద’ ‘మిస్టర్’ సినిమాలు ప్లాపయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ‘వాల్మీకి’ కాబట్టి.. ఈ చిత్రం కూడా గత చిత్రాల్లా చేదు అనుభవం ఇస్తుందేమో అని వారి భయం. అందుకే ‘వరుణ్ కొంపతీసి హ్యాట్రిక్ కొట్టెయ్యాడు కదా’ అంటూ కొందరు భయపడుతున్నారు.

Share.