ఇది నిజంగా పవన్ కు పెద్ద పరీక్షే…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటి ఎన్టీఆర్ లా మెప్పించడం ఏంటి అని ఆయోమయంలోకి వెళ్లిపోకండి. విషయం ఏమిటంటే పవన్ ఇప్పుడు ‘వకీల్ సాబ్’ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ తొలిసారి లాయర్ పాత్ర పోషించనున్నాడు. సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి,వెంకటేష్ , బాల కృష్ణ, నాగార్జున వంటి వారు లాయర్ పాత్రలు చేసి మెప్పించారు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో… ఇప్పటి వరకూ లాయర్ పాత్ర చేసింది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే..! రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది.

అతి తక్కువ వయసులోనే ఎన్టీఆర్ … లాయర్ గా చేసి మెప్పించాడు. ఆదిత్య అనే పాత్ర .. ఇప్పటివరకూ అందరికీ గుర్తుండి పోయింది. మరొక విషయం ఏమిటంటే… ఇప్పటి వరకూ మరో స్టార్ హీరో లాయర్ పాత్ర చెయ్యలేదు. ఇన్నాల్టికి పవన్ ఆ పాత్ర చేస్తున్నాడు. పవన్.. ఎన్టీఆర్ రేంజ్ లో మెప్పిస్తాడా.. అనేది చర్చనీయాంశం అయ్యింది.

Can Pawan Kalyan create that record1

అయితే ‘వకీల్ సాబ్’ రీమేక్ కావడం అతనికి కలిసొచ్చే అంశం. ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ పాత్రని ఆల్రెడీ… హిందీ లో అమితాబ్ బచ్చన్ అలాగే తమిళంలో అజిత్ వంటి స్టార్ లు పోషించారు. కాబట్టి వాళ్ళని ఫాలో అయిపోతే పవన్ సక్సెస్ అయిపోయినట్టే అని.కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బోణి కపూర్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Share.