మరో చార్ట్ బస్టర్ ఇచ్చిన తమన్..!

అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న తెరకెక్కుతోన్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘గీత ఆర్ట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఇక 2020 జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. పాటలతోనే ఈ చిత్రానికి విపరీతమైన హైప్ ఏర్పడింది. ‘సామజవరగమన’ ‘రాములో రాముల’ పాటలు ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంటే ఇప్పుడు మరో పాటతో ఇంకాస్త హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

Butta Bomma Song From Ala Vaikunthapurramuloo movie

తాజాగా విడుదల చేసిన ‘బుట్ట బొమ్మ’ పాట చాలా అద్భుతంగా ఉండనే చెప్పాలి. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ కు అర్మాన్ మాలిక్ తన గాత్రంతో ప్రాణం పోసాడనే చెప్పాలి. హీరోయిన్ అందాన్ని వర్ణిస్తూ ఈ చిత్రంలో హీరో పాడుకునే పాటగా ఈ చిత్రంలో ఉండబోతుందనుకుంట. ఈ పాట కచ్చితంగా మరో చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయమనే చెప్పాలి. ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పిచ్చ ఫామ్లో ఉన్నాడని ఈ పాటతో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇంకెందుకు లేట్.. మీరు కూడా ఓసారి వినెయ్యండి.!


రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Share.