మరో కొత్త కథతో రాబోతున్న శ్రీవిష్ణు..!

‘సెకండ్ హ్యాండ్’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ‘మెంటల్ మదిలో’ ‘నీది నాది ఒకే కథ’ ‘మా అబ్బాయి’ వంటి డిఫరెంట్ చిత్రాల్లో హీరోగా నటించి.. అలాగే ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి చిత్రాల్లో సహా నటుడి గా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు శ్రీవిష్ణు. యూత్ కి కనెక్ట్ అయ్యే డిఫరెంట్ కథల్ని ఎంచుకుంటూ… మంచి టేస్ట్ ఉన్న హీరో అనే పేరు తెచ్చుకున్నాడు. ఇక శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ఈ చిత్ర టీజర్ ను తాజాగా విడుదల చేసారు.

brochevarevaru-ra-movie-teaser-review1

brochevarevaru-ra-movie-teaser-review2‘మెంటల్ మదిలో’ వంటి డీసెంట్ హిట్టందుకున్న వివేకా ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకుడు. టైటిల్ తో సహా… టీజర్లో కూడా ఏదో కొత్తగా చూపించాలని చిత్ర యూనిట్ ట్రై చేసింది. శ్రీవిష్ణుతో పాటూ నివేదా థామస్, నివేదా పేతురేజ్, సత్య దేవ్,ప్రియదర్శి,రాహుల్ రామ కృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. నివేదా పేతురేజ్, సత్య దేవ్ ల ఇంట్రడక్షన్ తో టీజర్ మొదలయ్యింది.. ఇంటర్ ఫెయిలయ్యి అల్లరి చిల్లరగా తిరిగే పాత్రల్లో శ్రీవిష్ణు, రాహుల్, ప్రియదర్శి కనిపిస్తున్నారు. ఈ టీజర్ చూస్తుంటే ఇదో కిడ్నప్ డ్రామాగా సాగే కథని అర్థమవుతుంది. వచ్చీరాని పెర్ఫార్మన్స్ చేసే శ్రీవిష్ణు ని పక్కన పెడితే మిగిలిన నటీనటులందరూ మంచి పెర్ఫార్మన్స్ తో ఎంటర్టైన్ చేసేలానే ఉన్నారు. ఓవర్ ఆల్ గా టిజర్ కొత్తగా అనిపించడంతో పాటూ బాగుంది కూడా. మీరూ ఓ లుక్కెయ్యండి.

Share.