చిరుతో బోయపాటి సినిమా పక్కా!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. వెండితెరపై తన హీరోలను బోయపాటి ఎలా ఎలివేట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బడా హీరోలు, భారీ బడ్జెట్ లతో సినిమాలు తీసే ఈ డైరెక్టర్ క్రేజ్ ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. ‘వినయ విధేయ రామ’ ప్లాప్ ఎఫెక్ట్ బోయపాటిపై బాగా పడింది. ఆయనతో సినిమా అంటే హీరోలు భయపడుతున్నారు. దీంతో తన సత్తాను మరోసారి చాటి పూర్వవైభవం పొందాలనుకుంటున్నాడు బోయపాటి. ఈ క్రమంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. బోయపాటి, చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందనే వార్తలు వచ్చాయి. ‘సైరా’ సినిమా తరువాత చిరు.. బోయపాటితో సినిమా చేస్తాడనుకున్నారు. కానీ పరిస్థితులు బాలేకపోవడంతో.. ట్రాక్ రికార్డ్ బాగున్న కొరటాల శివతో చిరు సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత తను చేయబోయే ప్రాజెక్ట్ లలో బోయపాటి పేరు వినిపించలేదు. కానీ వీరి కాంబినేషన్ లో సినిమా పక్కా అని అంటున్నారు. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనుందని టాక్. ఇదివరకే బోయపాటి చిరుకి ఓ లైన్ వినిపించాడు. ఇప్పుడు అదే లైన్ పై వర్క్ చేస్తున్నాడట.

బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంటే సెట్స్ పైకి వెళ్లిపోవచ్చనేది బోయపాటి ఆలోచన. చిరు ‘ఆచార్య’ సినిమా తరువాత.. వినాయక్ తో ‘లూసిఫర్’ రీమేక్ చేస్తాడు. ఆ తరువాత బోయపాటి సినిమాను పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది. మరోపక్క మెహర్ రమేష్ సినిమా కూడా ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమాలన్నింటినీ చిరు ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి!

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Share.