దర్శకుడు బోయపాటికి మాతృ వియోగం

టాలీవుడ్ స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీను ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బోయపాటి శ్రీనివాస్ తల్లి బోయపాటి సీతారావమ్మ ఈ రోజు మరణించారు. ఆమె వయస్సు 80 సంవత్సరాలు. గుంటూరు జిల్లా పెదకాకాని ఆమె స్వగ్రామం. శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా పెదకాకానిలో తీవ్ర అనారోగ్య కారణంగా ఆమె మరణించారు.

Boyapati Srinu mother sitaravamma passes away1

దీనితో బోయపాటి ఇంట్లో తీవ్ర విషాద చాయలు అలముకున్నాయి. అక్కడే ఈ రోజు రాత్రి 7.22 నిమషాలకు ఆమె మరణించారు. గత కొంత కాలంగా ఆమె అస్వస్థతతో వున్నారు. విషయం తెలుసుకున్న బోయపాటి శ్రీను తన కుటుంబంతో కలిసి పెదకాకాని చేరుకున్నట్టు తెలుస్తుంది. ఆమె మృతి పట్ల పలువురు సిని ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.