బొమ్మరిల్లు ఎమోషన్స్ మరోసారి గుర్తు చేస్తాడా..?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అంటూ తన అదృష్టాన్ని మరోసారి నిరూపించుకోవడానికి అక్కినేని అఖిల్ సిద్ధమైపోతున్నాడు. అన్నీ కరెక్ట్ గా ఉంటే ఈసినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యి ఉండేది. కానీ, ఇప్పుడు శరవేగంగా విడుదల కోసం ముస్తాబవుతోంది. జూన్ 19వ తేదిన ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమాలో బొమ్మరిల్లు సినిమాలాగానే ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయని చెప్తున్నారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని, అందులో అఖిల్ యాక్టింగ్ హైలెట్ గా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.

అల్లు అరవింద్‌ గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు , వాసువర్మ నిర్మిస్తున్న ఈసినిమాపై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అంతేకాదు, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ బొమ్మరిల్లు భాస్కర్ తెలుగు ఇండస్ట్రీలో చేస్తున్న సినిమా కావడంతో ఇది హిట్ కొట్టడం అనేది డైరెక్టర్ కి కూడా చాలా అవసరం. అందుకే, ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్నీ హై డ్రామా ఉండేలా చూస్తున్నారట. చిలిపిగా కనిపిస్తూనే అఖిల్ ఎమోషన్స్ ని పలికిస్తాడని, హలో, మిస్టర్ మజ్నులని మించి క్లాస్ టచ్ ఇందులో ఉంటుందని చెప్తున్నారు. ఈసినిమాలో వెన్నెలకిషోర్ కామెడీ, మురళీశర్మ యాక్టింగ్ కూడా హైలెట్ గా ఉండబోతోందని టాక్.

Akhil Akkineni injured on the sets of Most Eligible Bachelor movie

ఇప్పటికే దాదాపుగా 70శాతం షూటింగ్ పూర్తి చేస్కున్న ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సాంగ్స్, సీన్స్ తీయాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత అఖిల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో కలిసి మరో సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా లవర్ బాయ్ లాగా కనిపిస్తూనే, ఈ సినిమాలో క్లాస్ టచ్ ఇవ్వబోతున్నాడన్నమాట. అదీ విషయం.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Share.