రాబోయే రొమాంటిక్ సైన్స్ – ఫిక్షన్ థ్రిల్లార్ బొంబాట్ ట్రైలర్ ను ఆవిష్కరించిన అమెజాన్ ప్రైమ్ వీడియో

రాఘవేంద్ర వర్మ దర్శకత్వంలో ఈ సైన్స్ ఫిక్షన్ సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద విశ్వాస్ హనుర్ కర్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంది. సుశాంత్, చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో మరియు 200 దేశాలు, టెరిటరీస్ లలో ప్రైమ్ సభ్యులు బొంబాట్ వరల్డ్ ప్రీమియర్ ను డిసెంబర్ 3 నుంచి ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోపై చూడవచ్చు. తాజా మరియు ప్రత్యేకమైన చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు, స్టాండ్-అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా ప్రకటనరహిత సంగీతం, భారతదేశపు అతిపెద్ద ఉత్పత్తుల ఎంపికపై ఉచి త ఫాస్ట్ డెలివరీ, టాప్ డీల్స్ కు ప్రారంభ ప్రాప్యత, ప్రైమ్ రీడింగ్‌తో అపరిమిత పఠనం, ప్రైమ్ గేమింగ్ తో మొ బైల్ గేమ్ కంటెంట్ తో ప్రైమ్ అద్భుతమైన విలువను అందిస్తుంది. అన్నీ నెలకు రూ.129 లకు మాత్రమే.

ముంబై, ఇండియా, 27 నవంబర్ 2020: అమెజాన్ ప్రైమ్ వీడియో నేడిక్కడ రాబోయే తెలుగు రొమాంటిక్ సైన్స్ – ఫిక్షన్ థ్రిల్లార్ బొంబాట్ కు సంబంధించి కుతూహలం రేకెత్తించే ట్రైలర్ ను ఆవిష్కరించింది. చౌదరి ఈ సినిమాలో సుశాంత్, చాందిని చౌదరి, సిమ్రాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సైన్స్ ఫిక్షన్ ప్లాట్ లో అభిమానులు ఆశిస్తున్న విధంగా చోటు చేసుకున్న రొమాన్స్, యాక్షన్, డ్రామా లపై తొంగిచూసే అవకాశాన్ని ఈ ట్రైలర్ అందిస్తుంది. రాఘవేంద్ర వర్మ దర్శకత్వంలో ఈ సైన్స్ ఫిక్షన్ సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద విశ్వాస్ హనుర్ కర్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న బొంబాట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 3న వరల్డ్ ప్రీమియర్ గా రానుంది.

ఈ సినిమాలో సుశాంత్ చిన్నప్పటి నుంచి దురదృష్టం వెంటాడే విక్కీ పాత్రలో కనిపిస్తారు. విక్కీ జీవితం లోని ఉద్వేగం, నాటకీయత, థ్రిల్ లాంటి వాటిలోకి మనల్ని మరింత లోతుగా తీసుకెళ్తుంది ఈ సినిమా. ఈ సందర్భంగా తన మొదటి సినిమా గురించి దర్శకుడు రాఘవేంద్ర వర్మ మాట్లాడుతూ, ‘‘బొంబాట్ అనేది ఓ చక్కటి ప్రేమకథ, థ్రిల్లింగ్ యాక్షన్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో ముడిపడిన ప్లాట్. ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ను అందిస్తుంది. ఈ సినిమా వీక్షకుల దృష్టిని ఆకట్టుకుంటుందని మేం భావిస్తున్నాం. సినిమాలో ప్రతీ ఒక్కరి నటనను కూడా వారు ఆనందిస్తారని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ గురించి నిర్మాత విశ్వాస్ హనుర్కర్ మాట్లాడుతూ, ‘‘బొంబాట్ సినిమాను అ మెజాన్ ప్రైమ్ వీడియోపై రిలీజ్ చేయడం మరియు దానితో అనుబంధం కలిగి ఉండడం మాకెంతో ఆనందా న్ని అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కు గల ప్రజాదరణ, దానికి గల విస్తృతి బొంబాట్ సినిమా ఎంతో మంది వీక్షకులను చేరుకునేందుకు తోడ్పడుతుందని విశ్వసిస్తున్నాం. తన అదృష్టం చిన్న నాటి నుంచే ముఖం చాటేసిందని భావించే విక్కీ చుట్టూరా ఈ సినిమా ఉంటుంది. విక్కీ జీవితంలో ఒక స మయంలో ఏం జరుగుతుందనేదే రోలర్ కోస్టర్ రైడ్. అది వీక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. వారి ముఖా లపై నవ్వు లు విరబూసేలా చేస్తుంది’’ అని అన్నారు.

కథాంశం: విక్కీని చిన్ననాటి నుంచి కూడా దురదృష్టం వెంటాడుతుంటుంది. చైత్రతో ఆయన అనుబంధాన్ని కూడా అ ది ప్రభావితం చేస్తుంది. అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన ప్రొఫెసర్ ఆచార్య కుమార్తె మాయాను క లుసుకున్న తరువాత మాత్రం పరిస్థితులు విక్కీకి అనుకూలంగా మారిపోతాయి. ఆ సమయంలోనే ఆ యనకు ఓ దిగ్భ్రాంతికరమైన నిజం ఒకటి తెలుస్తుంది…మాయా మనిషి కాదని…‘హ్యూమనాయిడ్ రోబో’ అని, ఆమె కోసం ఓ సైంటిస్ట్ వెతుకుతున్నాడని. ఎన్నో ప్రశ్నలు. అసలీ మార్మిక పాత్రలేంటి…ఏం చేస్తు న్నాయి…?

ప్రైమ్ వీడియో కేటలాగ్ లోని వేలాది టీవీ షోలు మరియు హాలీవుడ్ మరి యు బాలీవుడ్ చిత్రాల జాబి తాలోకి బొంబాట్ కూడా చేరనుంది. శకుంతలా దేవి, గులాబో సితాబో, పొన్ మగల్ వందల్, సి యు సూన్, వి, పెంగ్విన్ వంటి భారతీయ సినిమాలతో పాటుగా బాండిష్ బాండిట్స్, బ్రీత్: ఇన్ టు ది షాడోస్, కామిక్ స్థాన్ సీమ కామెడీ పా, పాతాళ్ లోక్, ది ఫర్గాటన్ ఆర్మీ – ఆజాదీ కే లియే, ఫోర్ మోర్ షా ట్స్ ప్లీజ్ సీజన్ 1, సీజన్ 2, ది ఫ్యా మిలీ మ్యాన్, మీర్జా పూర్, ఇన్ సైడ్ ఎడ్జ్ సీజన్ 1, సీజన్ 2, బ్రీత్ (?), మేడ్ ఇన్ హెవెన్ వంటి భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజి నల్ సిరీస్ ఉన్నాయి. టామ్ క్లాన్సీస్ జాక్ రయాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లియాబ్యాగ్, ది మార్వలెస్ మిసెస్ మైసెల్ వంటి అవార్డ్ వి న్నింగ్, ఎంతగానో ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ను కూడా ప్రైమ్ సభ్యులు చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఇవన్నీ లభ్యమవుతాయి. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషలలో టైటిల్స్ ను కూడా ఈ సర్వీస్ లో పొందవచ్చు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.