పెళ్లి చేసుకుంటుంన్నావ్ బి కేర్ ఫుల్ అంటూ బాలీవుడ్ బ్యూటీ వార్నింగ్!

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ హీరో రానాకు వార్నింగ్ ఇచ్చింది. దీనికి కారణం ఆయన మిహికాతో పెళ్లిని నిర్ధారించడమే. మిహికతో పెళ్ళికి సోనమ్ కపూర్ కి అసలు సంబంధం ఏమిటీ అనేదే కదా అసలు ప్రశ్న. విషయంలోకి వెళితే ఇటీవల రానా సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు. ఎప్పటి నుండో పరిచయం ఉన్న మిహికా బజాజ్ తో తన ప్రేమ గురించి చెప్పగా తను ఒకే అంది అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

అలాగే మిహికాతో కలిసి ఉన్న ఫోటో కూడా పంచుకున్నాడు. దీనితో రానాకు మరియు మిహికాకు పరిచయం ఉన్న వారందరూ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఐతే బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ మాత్రం రానాకు వార్నింగ్ ఇచ్చింది. ఐతే ఇదేదో సీరియస్ వార్నింగ్ కాదులెండి. రానా చేసుకోబోయే మిహికకు సోనమ్ కపూర్ బాగా తెలిసిన అమ్మాయి. వీరు అనేక కార్యక్రమాలలో కలిసి పాల్గొనడం జరిగింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అనేక సినిమాలు చేసిన రానా కూడా ఆమెకు పరిచయం ఉన్న వాడే.

Bollywood star actress warning Rana Daggubati1

దీనితో ఇద్దరి గురించి తెలిసిన అమ్మాయిగా, ఇకపై రానా జాగ్రత్తగా ఉండాలి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. పెళ్లి తరువాత భార్యలతో అనేక సమస్యలు ఉన్నాయి. మరి పెళ్లి బంధం అంతం ఈజీ కాదు, బి కేర్ ఫుల్ అని రానాను సోనమ్ హెచ్చరించింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ & రేటింగ్
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.