ఆమె ఏంట్రీతో జాన్ మూవీ పై అంచనాలు మరోస్థాయికి చేరాయి

90ల కాలంలో భాగ్యశ్రీ యువకుల కలల రాణిగా వెలుగొందిన హీరోయిన్. బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితురాలే. ఆమె సల్మాన్ ఖాన్ తో చేసిన మై నే ప్యార్ కియా సూపర్ డూపర్ హిట్.తెలుగులో ప్రేమ పావురాలు గా విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. భారీ మ్యూజికల్ హిట్ గా నిలిచిన ప్రేమ పావురాలు చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి. కాగా తెలుగు సినిమాలకి ఎప్పుడో దూరమైన భాగ్యశ్రీ ని ప్రభాస్ మళ్లీ టాలీవుడ్ కి తీసుకువస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్, ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ దర్శకత్వంలో ‘జాన్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటించబోతుందట. ఈ వార్తతో జాన్ మూవీపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. ఒకప్పటి క్రేజీ హీరోయిన్ ప్రభాస్ తల్లిగా నటిస్తుంది అనడంతో ఆసక్తి పెరిగిపోయింది. జాన్ మూవీ కూడా పాన్ ఇండియా మూవీగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న, నటిని తీసుకోవడం మంచిదనే ఉద్దేశ్యం తో భాగ్యశ్రీ ని ఎంపిక చేశారు. జాన్ కొత్త షూటింగ్ షెడ్యూల్ వాయిదా కారణంగా వచ్చే వారం నుండి మొదలు కానుంది.కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.