బిందు మాధవి షాకింగ్ కామెంట్స్ వైరల్…!

‘ఆవకాయ బిర్యానీ’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి బింధు మాధవి వరుస ఆఫర్లు అయితే అందుకుంది కానీ ప్రేక్షకుల అటెన్షన్ డ్రా చేయలేకపోయింది. ‘బంపర్ ఆఫర్’ ‘ఓం శాంతి’ ‘రామ రామ కృష్ణ కృష్ణ’ ‘పిల్ల జమిందార్’ ‘ప్రతీ రోజూ’ వంటి వరుస సినిమాల్లో నటించింది కానీ ఈ హైలెట్ కాలేకపోయింది. దీంతో కోలీవుడ్ కు చెక్కేసి అక్కడ వరుస సినిమాల్లో నటించింది.

అక్కడ అడపాదడపా సినిమాలు చేసి బాగానే పాపులర్ అయ్యింది. ఇక 2017 లో కమల్ హాసన్ హోస్ట్ గా చేసిన తమిళ బిగ్ బాస్ కు కూడా ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఆ సీజన్ టాప్ 5 లిస్టు లో చోటు కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ రెండు తమిళ సినిమాలు చేస్తుంది. అంతే కాదు … పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.

Bindu Madhavi shocking comments goes viral1

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తన సోషల్ మీడియాలో … అభిమానులతో ముచ్చటించింది.ఈ క్రమంలో తన లవ్ మ్యాటర్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.దానికి ఆమె జవాబిస్తూ…’నాకు ఓ సీక్రెట్ అఫైర్ ఉంది.కానీ ఇంకా కమిట్ అవ్వలేదు. ప్రస్తుతం ఆ విషయం బయటికి చెప్పలేను.పొరపాటున చెప్పినా.. సోషల్ మీడియాలో నన్ను దున్నేస్తారు” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Share.