‘బిగ్ బాస్4’ అఖిల్ నాగార్జున ల ఫోటో వెనుక కథ..!

‘బిగ్ బాస్ సీజన్ 4’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన అఖిల్ సార్దక్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అతని గేమ్ స్ట్రాటజీస్.. ప్రేక్షకుల అటెన్షన్ ను డ్రా చేశాయని చెప్పొచ్చు. అలా అని ఇతను విన్నర్ కాలేదు కానీ.. రన్నరప్ గా నిలిచాడు.గతంలో ఎన్నో సార్లు మోస్ట్ డిజైరబుల్ మెన్ గా అఖిల్ నిలిచినా… రాని గుర్తింపు ‘బిగ్ బాస్’ ద్వారా పొందాడు అఖిల్. మోనాల్ తో ఇతని రొమాన్స్.. విన్నర్ అభిజీత్ తో గొడవలు.. వంటి వ్యవహారాలతో నిత్యం ఆడియెన్స్ నోట్లో అఖిల్ పేరు మారు మోగింది.

ఇక నాగార్జునతో కూడా ఇతను చెప్పే డైలాగులు వైరల్ అయ్యేవి..! అంతేకాకుండా సినిమాల్లో విలన్ అవకాశాలను సంపాదించుకోవడమే తన గోల్ అని నాగార్జునతో అఖిల్ అప్పుడప్పుడు చెబుతుండేవాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల అఖిల్ తన తల్లితో కలిసి కింగ్ నాగార్జునను కలిసాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంత సడన్ గా అఖిల్.. నాగార్జునను ఎందుకు కలిసినట్టు అనే డౌట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.

నాగార్జున సినిమాలో అఖిల్ కు ఏమైనా ఛాన్స్ ఇస్తున్నాడా? అని కొందరు చర్చించుకుంటే.. మరికొందరు మాత్రం… అఖిల్ హౌస్లో ఉన్నప్పుడు.. ‘తను బయటకి వచ్చాక బిజినెస్ స్టార్ట్ చేస్తానని.. దాని ఓపెనింగ్ కు నాగార్జున రావాలంటూ’ కోరాడు. బహుశా ఆ వ్యవహారం పైనే అఖిల్ తన తల్లితో నాగ్ ను కలిసి ఉంటాడు అని మరికొందరు అనుకుంటున్నారు. మరి అసలు సంగతి ఏంటో అఖిల్ క్లారిటీ ఇస్తే కానీ చెప్పలేము..!

1

2

3

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Share.